Viral Video: కూతుళ్లు ఉన్న తండ్రులకే.. ఈ వీడియోలోని మజా అర్థమవుతుంది.. ఈ చిన్నారి తండ్రి పక్కనే కూర్చుని మరీ..!
ABN , First Publish Date - 2023-08-09T12:04:51+05:30 IST
'డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..' అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. దీనికి తగ్గట్టుగా ఈ తండ్రీకూతుళ్ళను చూస్తే..
తల్లిదండ్రులకు పిల్లలమీద ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. తమ అవసరాలు మానుకుని అయినా పిల్లలను సంతోషపెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ఇక పిల్లలు మరీ చిన్నపిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. ఓ కూతురు తన తండ్రి దగ్గర కూర్చుని చేస్తున్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కూతుళ్ళు ఉన్న తండ్రులకే ఇందులో మజా అర్థమవుతుందని అంటున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
'డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..' అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. ఈ మాటలను నిజం చేస్తూ చాలామంది తండ్రులు తమ కూతుళ్ళను యువరాణుల లెక్క చూస్తుంటారు. ఎంత గంభీరమైన తండ్రులు అయినా తమ చిన్నారి కూతుళ్ళ ముందు ఆటబొమ్మల్లా మారిపోతారు. వీడియోలో పడకగదిలో బెడ్ మీద తండ్రీకూతుళ్ళు(father and daughter) చూడొచ్చు. తండ్రి మంచానికి ఆనుకుని పడుకుని ఉంటే ఆయన పక్కే కూర్చున్న అతని చిన్నారి కూతురు చేతిలో స్కెచ్ పట్టుకుని తెగ సీరియస్ గా గీతలు, బొమ్మలు గీయడంలో మునిగిపోయింది. అయితే ఆ పాప బొమ్మలు గీయడానికి పుస్తకాన్నో, గోడనో ఉపయోగించలేదు. ఏకంగా తన తండ్రి ముఖాన్ని, టీ షర్ట్(father face and t shirt turn as canvas) ను బొమ్మలుగీసే కాన్వాస్ గా మార్చేసింది. ఆ తండ్రి కూడా తన కూతురు చేసే పనిని ఏమాత్రం విసిగించుకోకుండా ఏంజాయ్ చేస్తున్నాడు. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీస్తోంటే వీరి పక్కనే ఉన్న పిల్లి గుడ్లప్పగించి చూడటం చాలా సరదాగా అనిపిస్తుంది.
Smartphone: ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ పేలిపోవడం ఖాయం..!
ఈ వీడియోను Figen అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఓ ఆడపిల్లకు తండ్రి కావడం అనేది ఇలానే ఉంటుంది' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ చేశారు. 'ఆ పిల్లి తన భవిష్యత్తును ఊహించుకుంటోంది. బహుశా తండ్రి తరువాత ఆ పాప తననే ఎంపిక చేసుకుంటుందని పిల్లి అనుకుంటోంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'నలుగురు కూతుళ్ళకు తండ్రిగా నేను ఈ విషయాన్ని అంగీకరిస్తాను. ఇది కేవలం తండ్రీకూతుళ్ళ మధ్య మాత్రమే ఉండే బంధం' అని మరొకరు కామెంట్ చేశారు. 'అతను తన మొబైల్ బ్రౌజింగ్ లో ముగిపోయి కూతురు ఏం చేస్తోందో పట్టించుకున్నట్టు లేడు' అని మరికొందరు అంటున్నారు.