Viral Video: ఈ బామ్మ డాన్స్ కు నెటిజన్ల ఫిదా.. ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తోందో మీరే చూడండి.

ABN , First Publish Date - 2023-03-27T15:46:04+05:30 IST

ఈ బామ్మ తన వయసుతో సంబంధం లేకుండా డాన్స్ చేసి నెటిజన్ల హృదయాలు దోచేసింది

Viral Video: ఈ  బామ్మ డాన్స్ కు నెటిజన్ల ఫిదా.. ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తోందో మీరే చూడండి.

ఒకసారి మన అమ్మమ్మలు, నాన్నమ్మలను (Grand Mothers)గమనిస్తే.. వారి ఆరోగ్యం ఎంత పర్పెక్ట్ గా ఉంటుందో అర్థమవుతుంది. 70, 80 ఏళ్ళు దాటినా చురుగ్గా పనిచేసుకుంటున్నవారు ఉన్నారు ఈ కాలంలో. ఇప్పుడు ఈ బామ్మ కూడా తన వయసుతో సంబంధం లేకుండా డాన్స్ చేసి నెటిజన్ల హృదయాలు దోచేసింది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

'వయసు కేవలం నంబర్ మాత్రమే..' అని ఎన్ని డైలాగులు చెప్పినా శరీరం దృఢంగా లేకపోతే చాలా పనులు చేయలేం. నలభై, యాభై సంవత్సరాల వయసు దాటగానే కనీసం వంగడానికి, కింద కూర్చోవడానికి ఇబ్బంది పడేవారున్నారు. కానీ ఓ బామ్మ మాత్రం ఏకంగా డాన్స్ చేసింది. ఓ మరాఠీ ప్రోగ్రాంలో చాలామంది మహిళలు పాల్గొన్నారు. స్టేజీ మీద కొందరు గాయకులు(Singers) మరాఠీ పాటలు(Marathi Songs) పాడుతున్నారు. వారి చుట్టూ పెద్ద ఎత్తున మహిళలు నిలబడుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఆ పాటలకు తగ్గట్టు కాలు కదిపి డాన్స్ చేస్తున్నారు. ఆ మహిళల్లో ముందువరుసలో చీర కట్టి, కొప్పు పెట్టుకుని, పూలు అలంకరించుకుని నిండు ముత్తైదువుగా ఉన్న బామ్మ డాన్స్(Grandma Dance) వేస్తూ కెమెరాకు చిక్కింది. ఆ బామ్మ ఫుల్ హుషారుతో డాన్స్ వేస్తుంటే చుట్టూ ఉన్న మహిళల డాన్స్ చిన్నబోయినట్టే ఉంది.

Read also: Viral Video: ఇలాంటి ప్రయోగం మీరెప్పుడూ చూసుండరు.. ఈ టీచర్ ఎంతబాగా చూపించారో చూడండి!


ఈ బామ్మ డాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో గోర్దాన్(Gordan) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. 'ముందు వరుసలో ఉన్న బామ్మ నా నిరాశను దూరం చేసింది' అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ డాన్స్ కు ఫిదా అయిపోయారు. ఆ ఎనర్జీ లెవల్ సూపర్ అంటున్నారు. 'నాకు ఆ బామ్మలా డాన్స్ చెయ్యాలని ఉంది కానీ, నా శరీరంలో విటమిన్స్ తొందరగా అయిపోతాయేమోనని భయంగా ఉంది' అని చమత్కరించారు ఒకరు. 'ఆ బామ్మ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నావాటిని సులువుగా అధిగమిస్తుంది, ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసమే దానికి నిదర్శనం' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Read also: PCOS: మహిళల్లో పిసిఓయస్ కు అసలు కారణాలు ఇవే.. చేతులారా ఇంత సమస్య తెచ్చిపెట్టుకుంటున్నారెందుకు?


Updated Date - 2023-03-27T16:08:24+05:30 IST