Viral Video: ముసలామే కానీ.. మహానుభావురాలు.. వధువుతో మాటలు బంద్ చేసి మరీ ఆ వరుడు ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకున్నాడుగా..!
ABN , First Publish Date - 2023-05-01T20:53:48+05:30 IST
వంగితే నడుములు పట్టుకుపోయే వయసులో ఉన్న ఈ బామ్మ, వయసులో ఉన్న అమ్మాయిలకు గట్టి పోటీ ఇస్తున్నట్టే డాన్స్ చేస్తోంది. పెళ్ళిలో ఈ బామ్మ డాన్స్ చూసిన వరుడు, వధువును పక్కన పెట్టి మరీ బామ్మతో స్టెప్పులేస్తూ వీడియో తీయించుకున్నాడు
వయసు కేవలం నెంబర్ మాత్రమే(Age is only number) అని చాలామంది అంటూ ఉంటారు. కొందరు పెద్ద వాళ్ళ చురుకుదనం, వారిలో ఉత్సాహం చూస్తే ఆ మాట నిజమేనని నమ్మక తప్పదు. ఈ ముసలామె కూడా ఈ మాటకు చక్కగా న్యాయం చేస్తోంది. వంగితే నడుములు పట్టుకుపోయే వయసులో ఉన్న ఈ బామ్మ, వయసులో ఉన్న అమ్మాయిలకు గట్టి పోటీ ఇస్తున్నట్టే డాన్స్ చేస్తోంది. పెళ్ళిలో ఈ బామ్మ డాన్స్ చూసిన వరుడు, వధువును పక్కన పెట్టి మరీ బామ్మతో స్టెప్పులేస్తూ వీడియో తీయించుకున్నాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి, ఈ బామ్మ గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
సంతోషకరమైన సందర్భాలలో పెద్దవారు పిల్లలైపోతారు. మరీ ముఖ్యంగా పెళ్ళివేడుకలలో ఇలాంటి సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి. భారతదేశానికి పొరుగురాష్ట్రం అయిన నేపాల్(Nepal) లో ఓ పెళ్ళి వేడుకలో(Marriage ceremony) ఎంతో ఉత్సాహంగా డాన్స్ వేస్తున్న బామ్మ(grandma) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నేపాల్ లో ఓ పెళ్ళి వేడుక జరుగుతోంది. ఆ వేడుకలో ఓ బామ్మ తన వయసును కూడా లెక్కచేయకుండా పడుచు పిల్లలా ఎంతో హుషారుగా డాన్స్ చేస్తోంది. ఆమె బాలీవుడ్ సినిమా సర్గమ్(Bolly wood movie Sargam) లోని ఎవర్గ్రీన్ పాట 'డఫ్లీవాలే దఫ్లీ బాజా'(dapli wale dhapli baja) అనే పాటకు ఎంతో అందంగా డాన్స్ వేస్తోంది. బామ్మ డాన్స్ కు ఫిదా అయిన వరుడు(groom), వధువును(bride) పక్కన పెట్టి మరీ బామ్మ దగ్గరకు పరుగులు తీశాడు. బామ్మతో కలిసి తను కూడా కాలు కదిపి స్టెప్పులు వేశాడు(groom dance with grandma). ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!
ఈ వీడియోను everythingaboutnepal అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ డాన్స్ కు ఫిదా అవుతున్నారు. 'ఆ బామ్మ ఎంత ఉత్సాహంగా డాన్స్ చేస్తోందో.. వరుడు, వధువును వదిలి మరీ బామ్మతో జాయిన్ అయ్యాడంటే ఆమెలో ఉన్న ఎనర్జీ అర్థమవుతోంది' అని అంటున్నారు. 'తమకు నచ్చినట్టు సంతోషంగా ఉండటం అంటే ఇదే.. ఎవరో ఏదో అనుకుంటారని సంతోషాన్ని వదులుకోనక్కర్లేదు' అని మరికొందరు కామెంట్ చేశారు. 'ఈ బామ్మ డాన్స్ సూపర్.. 60ఏళ్ళలోనూ 20ఏళ్ళ అమ్మాయిలా డాన్స్ చేస్తోంది' అని మరికొందరు బామ్మ డాన్స్ కు పొగడ్తలు కురిపిస్తున్నారు.