Viral Video: నిజమైన దేశభక్తి అంటే ఇది భయ్యా.. ఫారిన్ యూనివర్సిటిలో ఇండియా కుర్రాడు చేసిన పని చూస్తే..

ABN , First Publish Date - 2023-08-15T13:16:55+05:30 IST

భారతదేశం యావత్తు 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మునిగిపోయింది. మరొకవైపు విదేశీ గడ్డ మీద భారత్ కుర్రాడు చేసిన పని ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: నిజమైన దేశభక్తి అంటే ఇది భయ్యా.. ఫారిన్ యూనివర్సిటిలో ఇండియా కుర్రాడు చేసిన పని చూస్తే..

దేశం గురించి, దేశభక్తి గురించి ప్రస్తావన వస్తే భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. భారతదేశం యావత్తు 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మునిగిపోయింది. మరొకవైపు విదేశీ గడ్డ మీద భారత్ కుర్రాడు చేసిన పని ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కుర్రాడి వీడియో చూసిన భారతీయుల గుండెలు పులకరిస్తున్నాయి. నిజమైన దేశభక్తి ఇలాగే ఉంటుంది, నువ్వు నిజమైన దేశభక్తుడివి అంటూ ఇతనిమీద పొగడ్తల వర్షం. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అని గురజాడ రాశారు. దేశభక్తి, దేశ గౌరవం మనుషుల ప్రవర్తనలో వ్యక్తం అవుతుంటుంది. అలాంటి సంఘటనలు జరిగినపుడు, అటువంటి సందర్భాలు చూసినప్పుడు ప్రజల మనసు దేశభక్తితో ఉప్పొంగుతుంది. దేశంలోనే కాదు, దేశాలు మారినా, ఖండాలు దాటినా తమ దేశాన్ని, మూలాలను మరువకపోవడం, దేశ పౌరుడినని అందిరికీ తెలిసేలా చెయ్యడం కూడా దేశభక్తే. భారతదేశానికి చెందిన ఓ కుర్రాడు(Indian young man) విదేశాల్లో గ్రాడ్యుయేట్ చెయ్యడానికి వెళ్ళాడు. చదువు ముగిసిన తరువాత స్నాకోత్సవ కార్యక్రమం జరిగింది. వీడియోలో స్నాకోత్సవ కార్యక్రమంలో భారత్ కు చెందిన కుర్రాడు భారత సాంప్రదాయ దుస్తులైన పొడవాటి కాషాయం రంగు కుర్తా, కింద ఎరుపు రంగు ధోతి ధరించాడు. అతను తన గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు వెళ్ళినప్పుడు ఎంతో హుందాగా అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆ తరువాత తన కుర్తా జేబులో నుండి త్రివర్ణ పతాకాన్ని బయటకు తీసి తాను భారతీయ కుర్రాడినని సగర్వంగా అందరిముందు చాటి చెప్పాడు. త్రివర్ణపతాకాన్ని చేతబట్టి ఆ ప్రాంగణంలో అతను తిరగడం ఎంతో బాగుంది. ఇదంతా చూసిన అక్కడి వారు అతన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు.

Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన పనేంటంటే..!



ఈ వీడియోను IAS ఆఫీసర్ Awanish Sharan తన ట్విట్టర్(Twitter) అకౌంట్ లో పోస్ట్ చేశారు. 'ఇతను డిగ్రీని పొందాడు, అలాగే కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుర్రాడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ' ప్రతి తల్లిదండ్రుల కల ఇదే.. కేవలం వారే కాదు, దేశం కూడా గర్వపడేలా చేయాలని వారు కోరుకుంటారు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఈ కుర్రాడిని చూస్తోంటే చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగం గుర్తొచ్చింది' అని మరొకరు కామెంట్ చేశారు.

Viral Video: బాబోయ్ కొండముచ్చుకు ఇంత ఆవేశమా? సింహాన్ని సింగిల్ గా ఉరికించింది..


Updated Date - 2023-08-15T13:16:55+05:30 IST