Viral Video: పాకిస్తాన్ కుకింగ్ షోలో ఈ మహిళ చేసిన పనికి అవాక్కైన జడ్జెస్.. అసలు విషయమేంటంటే..

ABN , First Publish Date - 2023-02-28T16:25:02+05:30 IST

పాకిస్తాన్ మాస్టర్ చెఫ్ లో ఒక మాస్టర్ పీస్ అంటూ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video: పాకిస్తాన్ కుకింగ్ షోలో ఈ మహిళ చేసిన పనికి అవాక్కైన జడ్జెస్.. అసలు విషయమేంటంటే..

మహిళలు వంటింటి కుందేళ్ళు అనే మాటను పటాపంచలు చేస్తూ అదే వంటింటి నైపుణ్యంతో డబ్బు సంపాదిస్తున్న మహిళలు ఉన్నారు. మరికొందరు వండటంలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి కుకింగ్ షోలలో పాల్గొంటూ ఉంటారు. మాస్టర్ చెఫ్ ఇండియా, మాస్టర్ చెఫ్ వరల్డ్ వంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే ఓ పాకిస్తానీ మహిళ అక్కడి కుకింగ్ షోలో చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

మన ఇండియా(India)లో మాస్టర్ చెఫ్ ఇండియా(Master Chef India) లాగా పాకిస్తాన్(Pakistan) లో KM The Kitchen Master అనే కుకింగ్ షో(Cooking Show) నిర్వహిస్తున్నారు. అన్ని కుకింగ్ షోలలో లాగే ఈ షోలో కూడా పార్టిసిపేట్ చేసినవారు రుచికరమైన వంటలు వంటి జడ్జె(Judges)స్ ను మెప్పించాలి. అందులో భాగంగా ఓ మహిళ బిర్యానీ(Biryani) తీసుకువచ్చి జడ్జెస్ ముందు పెట్టింది. ఈ కుకింగ్ షోలలో కేవలం వండటమే కాకుండా వండిన పదార్థాన్ని అందంగా ప్లేట్లలో సర్థడం, కళాత్మకత చూపించడం కూడా చాలా ముఖ్యం. అయితే పాకిస్తాన్ కుగింగ్ షోలో మహిళ నేరుగా బాక్స్ లో బిర్యానీ తీసుకొచ్చింది.

Read also: Viral Video: 'Crow man of India' ఇతని అరుపుకు కాకులన్నీ కట్టకట్టుకుని వచ్చేస్తున్నాయ్..


జడ్జెస్ ఆమె ఏ స్పెషల్ ఐటమ్ తెస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మహిళ బిర్యానీ తెచ్చానని చెప్పడంతో వారు సంతోషించారు కూడా. కానీ ఆ మహిళ జడ్జెస్ ముందు బిర్యానీ బాక్స్ ఉంచడంతో వారు కంగుతిన్నారు. 'ఏంటిది బిర్యానీని ఎందుకు ఇలా బాక్స్ లో తీసుకొచ్చావు? అందంగా ప్రెజెంట్ చెయ్యలేదు ఎందుకు" అని జడ్జెస్ ఆమెను ప్రశ్నించారు. దానికి బదులుగా ఆమె నాకు రెస్టారెంట్(Restaurant) లో ఇలాగే ఇచ్చారని సమాధానమిచ్చింది. ఆమె సమాధానంతో జడ్జెస్ అవాక్కయ్యారు. 'రెస్టారెంట్ నుండి కుకింగ్ షో జడ్జెస్ దగ్గరకుఫుడ్ తీసుకురావడం ఏంటి? నువ్వు వండిన ఫుడ్ ఎందుకు తీసుకురాలేదు?' అని జడ్జెస్ ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిర్యానీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోమని ఆమెకు చెప్పారు. కానీ వింతగా ఆ మహిళ జడ్జెస్ తో వాదనకు దిగింది. 'నేను వండిందే తీసుకురమ్మని మీరు ఎక్కడా చెప్పలేదు కదా.. ఈ బిర్యానీని మీకోసం కష్టపడి తీసుకొచ్చాను మీరు టేస్ట్ చెయ్యాల్సిందే..' అని మొండి చేసింది. ఆమె తీరుకు ఆగ్రహించిన జడ్జెస్ లలో ఒకరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. షోలో టెలికాస్ట్ అయిన ఈ సంఘటన మొత్తం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ మాస్టర్ చెఫ్ ఒక మాస్టర్ పీస్(Pakistan Master Chef is a Masterpiece) అంటూ Rajbets India అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి వివిధరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తీరుకు జడ్జెస్ ఆమె చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం టిఆర్ఫి రేటింగ్ కోసం ఈ షో నిర్వాహకులు కావాలనే స్క్రిప్టెడ్ గా ప్లే చేసినట్టున్నారని అన్నారు.

Updated Date - 2023-02-28T16:25:02+05:30 IST