Viral Video: అమ్మబాబోయ్ ఇంత పెద్ద కింగ్ కోబ్రాను మీరెప్పుడైనా చూశారా? ఓ వ్యక్తి దాని తోక పట్టుకుని మరీ..
ABN , First Publish Date - 2023-04-28T15:34:32+05:30 IST
చిన్నా చితకా పాములంటే పర్లేదు కానీ మరీ భారీగా ఉన్న ఈ కింగ్ కోబ్రాను నేరుగా చూస్తే ప్యాంట్ తడిచిపోతుంది..
పాము అనే మాట వింటేనే భయపడతాం. కొందరు ఎంతో సులువుగా పాములు పట్టేస్తుంటారు. పాములు పట్టడంలో ఎంత నైపుణ్యం ఉన్నా ఆ పనిలో ప్రమాదమెప్పుడూ పొంచి ఉంటుంది. మరీ ముఖ్యంగా అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కాటు వేసిందంటే నిమిషాల్లో మృత్యు ఒడిలోకి జారుకుంటారు. అలాంటి కింగ్ కోబ్రాను తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ పట్టుకున్నాడొక వ్యక్తి. ఇతను పాము పట్టుకోవడం చూస్తూంటే శరీరం చల్లబడిపోతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పాముల్ని ఎంత చాకచక్యంగా పట్టేవాళ్లయినా కింగ్ కోబ్రా(King Cobra) అంటే భయపడతారు. అత్యంత విషపూరితమైన ఈ సర్పం(most venomous snake) కాటు వేస్తే ఏకంగా పుణ్యలోకాలకు టికెట్టు దొరికిన్టటే.. అందులోనూ చిన్నా చితకా పాములంటే పర్లేదు కానీ మరీ భారీగా ఉన్న కింగ్ కోబ్రాను చూడటమే అరుదు అయితే.. దాన్ని దైర్యంగా పట్టుకోవడం నిజంగా సాహసమనే చెప్పాలి. గోవా రాష్ట్రంలో పంటపొలాలకు ఆనుకుని ఉన్న పొదల్లో ఓ భారీ కింగ్ కోబ్రా(giant king cobra) కనబడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్( forest officers) అక్కడికి చేరుకున్నారు. పాములు పట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగిన ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. ఆ భారీ కింగ్ కోబ్రా దాదాపు చాంతాడంత ఉంది, దాని లావు చూస్తే ఏకంగా ఏ కొండ చిలువనో తలపిస్తోంది. అంత భయంకరంగా ఉన్న కింగ్ కోబ్రాను పొదల్లో నుండి బయటకు లాగాడు అతను. దాన్ని పంట పొలంలోకి లాగి దాని తోక పట్టుకున్నాడు. ఆ పాము తిరిగి పొదల్లోకి జారుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అతను దాన్ని వదల్లేదు. ఆ కింగ్ కోబ్రా గుస్సా చేస్తూ పడగెత్తి అతన్ని కాటు వేయడానికి పలుమార్లు ప్రయత్నించింది. కానీ అతను దాని కాటుకు గురికాకుండా తప్పించుకున్నాడు. ఆ పాము పడగెత్తినప్పుడు చూస్తే ఏ సినిమాలోనో తప్ప నిజజీవితంలో ఇంత పెద్ద పడగ ఉన్న పామును, ఇంత భారీ పరిమాణం కలిగిన పామును చూడలేదని అనిపిస్తుంది. పొలంలో ఉన్న రంధ్రాల్లోకి దూరిపోవాలని ఆ పాము ఎంత ప్రయత్నించినా ఫారెస్ట్ డిపార్మెంట్ వారు చాకచక్యంగా దాన్ని తాము ఏర్పాటుచేసిన సంచిలోకి వెళ్లేలా చేసి దాన్ని బంధించారు.
Viral Video: మీ CV పంపండి అంటూ ఓ కాలేజీ కుర్రాడికి గూగుల్ నుండి సందేశం..అతను చేసిన ఒకే ఒక్క పనితో అదిరిపోయే ఉద్యోగం.. ఇంతకూ అతనేం చేశాడంటే..
ఈ వీడియోను Commander Ashok Bijalwan అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పాము పరిమాణం చూసి అవాక్కయ్యేవాళ్లు కొందరైతై దాన్ని పట్టుకున్న వ్యక్తి ధైర్యానికి సలాం చేస్తున్నవారు మరికొందరు. 'బాబోయ్ అతనికి ఎంత ధైర్యం? అంత పెద్ద పామును అలా ఎలా హ్యాండిల్ చేశాడు, దాన్ని చూస్తే ప్యాంట్ తడిచిపోయే రేంజ్ లో ఉంది' అని కొందరు కామెంట్స్ చేశారు. 'అది చాలా పెద్దగా ఉంది, కొండచిలువలా అది నెమ్మదిగా కదలదు, దాన్ని హ్యాండిల్ చేయడమంటే మాటలు కాదు' అని మరికొందరు అన్నార. ఏది ఏమైనా చెమలు పట్టించే ఈ కింగ్ కోబ్రా సురక్షితంగానే బంధించబడిందని అందరూ అంటున్నారు.