Viral Video: ఇదేంటి..? ప్రేయసి జుట్టంతా కత్తిరించి పూర్తిగా గుండు కొట్టేస్తున్నాడని అనుకునేలోపే షాకింగ్ సీన్.. ప్రియుడు ఏం చేశాడో చూసి..

ABN , First Publish Date - 2023-04-13T20:47:43+05:30 IST

ప్రియుడు ట్రిమ్మర్ తో తన ప్రియురాలి జుట్టు తొలగిస్తున్న ఈ వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. 'అయ్యో అదేంటి అతనికేమైనా పిచ్చా.. అంత సులువుగా అమ్మాయికి గుండు కొట్టేస్తున్నాడు' అని అనుకుంటున్నలోపే అందరికీ షాకింగ్ ట్విస్ట్ తగిలింది. ఈ వీడియో చూసి నెటిజన్లు 'ఓరి దేవుడా..!' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఇదేంటి..? ప్రేయసి జుట్టంతా కత్తిరించి పూర్తిగా గుండు కొట్టేస్తున్నాడని అనుకునేలోపే షాకింగ్ సీన్.. ప్రియుడు ఏం చేశాడో చూసి..

ప్రేమలో ఉన్న వాళ్లు తమ పార్టనర్ బాధపడుతుంటే అస్సలు సహించలేరు. ఏదో ఒకటి చేసి వారి బాధను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. మరికొందరు చిలిపి పనులతో ఆటపట్టించుకుంటూ ఉంటారు. ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రియుడు ట్రిమ్మర్ తో తన ప్రియురాలి జుట్టు తొలగిస్తున్న ఈ వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. 'అయ్యో అదేంటి అతనికేమైనా పిచ్చా.. అంత సులువుగా అమ్మాయికి గుండు కొట్టేస్తున్నాడు' అని అనుకుంటున్నలోపే అందరికీ షాకింగ్ ట్విస్ట్ తగిలింది. ఈ వీడియో చూసి నెటిజన్లు 'ఓరి దేవుడా..!' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రేమ, పెళ్ళి, స్నేహం లాంటి బంధాలు కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు బాధలను, కష్టాలను కూడా పంచుకోగలమనే భరోసా ఇస్తాయి. ముఖ్యంగా తాము ప్రేమించిన వారిపట్ల ఎంతో ప్రేమతో.. మరింత అనురాగంతో ఉంటారు. అబ్బాయిలు అయితే తన ప్రేయసి కంట్లో కన్నీరు వస్తే ఏదో ప్రళయం వచ్చినట్టే ఫీలైపోతారు. ఓ అబ్బాయి తన ప్రియురాలికి(girl friend) గుండు కొడుతున్న వీడియో(hair shave video) ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమ్మాయి అద్దం ముందు చైర్ లో కూర్చుని ఉండగా అబ్బాయి ట్రిమ్మర్(trimmer) సహాయంతో ఆమె తలమీద వెంట్రుకలు(hair) మొత్తం తీసేసి ఆమెకు గుండు (head shave)కొట్టేశాడు. అసలే అమ్మాయిలకు జుట్టంటే చెప్పలేనంత ప్రేమ, కురులను సిరులతో పోల్చుకుంటారు. అలాంటిది ఆ అమ్మాయికి అతను అలా గుండు కొట్టేస్తుంటే 'అయ్యో అతను ఇంత పిచ్చి పని చేస్తున్నాడేంటి?' అనిపిస్తుంది. కానీ ఆమెకు పూర్తీగా గుండు కొట్టేశాక అతను ఆమె వెనుక నిలబడుకుని తన జుట్టును కూడా ఎంతో సునాయాసంగా రిమూవ్ చేస్తున్నాడు. అతనలా జుట్టు తీసేసుకుంటుంటే ఆ అమ్మాయి ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని భోరున విలపిస్తుంది. ఏడవడద్దని ఆమెను ఊరడిస్తూ అతను తన పని కొనసాగించాడు.

Onions: వామ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలో అని సంబరపడ్డాం.. కానీ ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..


అమ్మాయికి పేనుకొరుకు(Alopecia) సమస్య కారణంగా జుట్టు మొత్తం రాలిపోతోందట(hair loss). తలమీద జుట్టు పెచ్చులు పెచ్చులుగా రాలిపోయి చాలా వికారంగా తయారైంది. దీంతో ఆమె మానసికంగా చాలా బలహీనమైపోయింది. ఊడిపోతున్న జుట్టును చూసి ఆమె మరింత డిప్రెషన్లోకి వెళుతుందనే ఆలోచనతో ఆమె ప్రియుడు(boy friend) ఆమెకు గుండు కొట్టేశాడు. ఆ తరువాత అతను కూడా గుండు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్తుపోయారు. 'ఆమె బాధను తగ్గించడానికి అతను అలా చేయడం అతనికి ఆమె మీద ఎంత ప్రేమ ఉందో రుజువుచేస్తోంది' అని అంటున్నారు. 'నిజమైన ప్రేమంటే ఇదే' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 'సాధారణంగా మహిళలకు గుండు చేస్తే అందవికారంగా కనిపిస్తారు. కానీ ఈ మహిళ ఎంత అందంగా ఉందో' అని ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నారు.

Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..


Updated Date - 2023-04-13T20:47:43+05:30 IST