Viral Video: రాత్రిపూట నడిరోడ్డుపై జరిగిన ఒక్క ఘటనతో ఆ యువతికి కోలుకోలేని షాక్.. ఈ ప్రియుడికి బ్రేకప్ చెప్పడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-04-27T20:34:15+05:30 IST

ప్రతి అమ్మాయి తన ప్రియుడు తన పట్ల చాలా కేరింగ్ చూపించాలని, తనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని అనుకుంటుంది. కానీ రాత్రి పూట నడిరోడ్డుపై ఓ అమ్మాయికి మాత్రం

Viral Video: రాత్రిపూట నడిరోడ్డుపై జరిగిన ఒక్క ఘటనతో ఆ యువతికి కోలుకోలేని షాక్.. ఈ ప్రియుడికి బ్రేకప్ చెప్పడం ఖాయం..!

ప్రేమలో ముఖ్యంగా నమ్మకం, భరోసా ఉండాలి. అది లేకపోతే ప్రేమ ఎక్కువ కాలం కొనసాగదు. మరీ ముఖ్యంగా ప్రతి అమ్మాయి తన ప్రియుడు తన పట్ల చాలా కేరింగ్ చూపించాలని, తనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని అనుకుంటుంది. కానీ రాత్రి పూట నడిరోడ్డుపై ఓ అమ్మాయికి దారుణమైన అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు 'ఆ అమ్మాయి తన ప్రియుడికి బ్రేకప్ చెప్పడం ఖాయం' అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిల ముందు చాలా డైలాగ్స్ చెబుతారు. నువ్వంటే ఇష్టం అనే మాట దాటి.. నువ్వంటే ప్రాణం అని, నీకోసం ప్రాణాలైనా ఇస్తానని చెబుతుంటారు. కానీ దురదృష్టం కొద్దీ కొంతమంది కుర్రాళ్లకు ఆ మాటను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఈ కుర్రాడు దారుణంగా విఫలమయ్యాడు.వీడియోలో ఓ ప్రేమ జంట(love pair) రాత్రి సమయంలో నడిరోడ్డు మీద వెళుతోంది. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అప్పుడే సడన్ గా ఓ బైక్(Bike) మీద ఇద్దరు వ్యక్తులు వారిముందు వచ్చి ఆగారు. వారు ముఖానికి ముసుగులు(mask on faces) వేసుకుని ఉండటంతో వారు దొంగలని(thievాs) ఇట్టే అర్థమైపోతోంది. బైక్ మీద నుండి ఒకడు దిగి తన చేతిలో తుపాకీ(gun) చూపించి అమ్మాయిని తన దగ్గరున్న డబ్బు, విలువైన వస్తువులు(Money, expensive things) ఇచ్చెయ్యమని అడిగాడు. దీంతో ఆ అమ్మాయి తన దగ్గరున్న హెడ్ సెట్, మొబైల్ ఫోన్, డబ్బు (headset, mobile, money)వాళ్లకు అప్పగించేసింది. ఆమె అలా ఇచ్చెయ్యగానే వారు ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా అక్కడినుండి వెళ్ళిపోయారు. అయితే దొంగలు వెళ్లిపోయాక ఆ అమ్మాయి వెనక్కు తిరిగి చూసి ఖంగుతినింది. తన పక్కనే నడుస్తున్న తన బాయ్ ఫ్రెండ్(Boyfriend) అక్కడ లేడు. దొంగ తుపాకీ చూపిస్తూ బైక్ దిగిన్పపుడే అతను అక్కడినుండి జంప్ అయ్యాడు. తనకు రక్షణగా ఉండాల్సిన ప్రియుడే అలా వెళ్ళిపోయేసరికి ఆ అమ్మాయికి షాక్ కొట్టినంత పనయ్యింది.

Viral News: 20 ఏళ్ల ప్రియుడి ఇంటికి తరచూ వెళ్తూ.. అతడి తండ్రితోనే ప్రేమలో పడిన యువతి.. సడన్‌గా ఇద్దరూ ఎస్కేప్.. ఏడాది తర్వాత చూస్తే..


(ది ఫిజెన్ )The Figen అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను ట్విట్టర్(Twitter) లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రియుడి ప్రవర్తన పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు. 'అతను పిరికివాడు, అమ్మాయి ప్రాణాలను రిస్క్ లో పెట్టి వెళ్ళిపోయాడు' అని మండిపడుతున్నారు. 'అతను నిజంగా ప్రియుడా? ఆమెను అలా వదిలేసి తన మానాన తను అలా వెళ్లిపోయాడేంటి?' అని మరికొందరు అంటున్నారు. అయితే కొందరు మాత్రం 'ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో దారుణాల ప్రభావం వల్ల అతను భయపడి అలా పారిపోయి ఉండచ్చు, అతని తప్పేమీ లేదు' అని అతనికి మద్దతుగా కామెంట్స్ పెట్టారు.'ఆ దొంగలు ఆమె దగ్గర డబ్బు వస్తువులు మాత్రమే తీసుకుని వెళ్లారు. ఆమెను ఏమైనా చేసి ఉంటే ఏంటి పరిస్థితి?' అని మరికొందరు ప్రియుడు ఎంత పెద్ద తప్పు చేశాడో చెబుతున్నారు.

Crime News: ప్రేయసితో పెళ్లి జరిగేందుకు పక్కా స్కెచ్.. పోలీసులకు ఫోన్ చేసి సీఎంనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన ప్రియుడు..!


Updated Date - 2023-04-27T20:51:44+05:30 IST