Share News

Viral Video: ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన 58 సెకన్ల వీడియో.. దెబ్బకు రూ.10 వేల జరిమానా..!

ABN , First Publish Date - 2023-11-23T13:06:47+05:30 IST

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో వింత విషయాలే కాదు సామాజిక స్పృహ పెంపొందించే విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. ఈ వీడియో చూసి ప్రభుత్వమే అలర్ట్ అయ్యింది.

Viral Video: ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన 58 సెకన్ల వీడియో.. దెబ్బకు రూ.10 వేల జరిమానా..!

సోషల్ మీడియాకు ఆనంద్ మహీంద్రా పేరును ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నోఆసక్తికర విషయాలను తన ఫాలోయర్లతో సామాజిక మాద్యమంలో పంచుకుంటారు. అయితే ఆయన తాజాగా షేర్ చేసిన 58సెకెన్ల వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోలో ఉన్న కొందరు వ్యక్తులు చేసిన పనికి ప్రభుత్వం 10వేల జరిమానా విధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రా చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. ముంబైలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో వింత విషయాలే కాదు సామాజిక స్పృహ పెంపొందించే విషయాలను, ప్రజలలో మార్పు కలిగించే సంఘటనలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఒక వీడియో షేర్ చేశారు. వీడియోలో కొందరు వ్యక్తులు గేట్ వే ఆఫ్ ముంబై(Gate way of Mumbai) వద్ద కొన్ని ప్లాస్టిక్ సంచులు పట్టుకుని కనిపిస్తారు. వారికి కొంత దూరంలో ఒక ట్యాక్సీ కూడా ఉంది. వారు ఒక్కొక్క ప్లాస్టిక్ సంచిని తీసుకొచ్చి వాటిని విప్పి సంచులలో ఉన్న ఎండు పువ్వులు, ఇతర వ్యర్థాలను సముద్రం నీళ్లలో పడేస్తున్నారు. ఏదో శుభకార్యం లేదా పూజ తరువాత మిగిలిపోయిన వాటిని సముద్రంలో పడేస్తున్నట్టు అర్థం అవుతుంది. వారు పూలను నీళ్లలో పడేస్తుంటే దగ్గరలోనే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా ఆనంద్ మహీంద్రా కంట పడింది.

ఇది కూడా చదవండి: 40 ఏళ్లు దాటినా.. యంగ్‌గా కనిపించేందుకు 7 టిప్స్..!


సముద్రపు నీళ్లలో వ్యర్థాలు పడేస్తుండటంతో ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని సులువుగా తీసుకోలేకపోయారు. ఈ వీడియోను Ujwal Puri // ompsyram.eth అనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఉదయాన్నే గేట్ ఆప్ ఇండియా దగ్గరి దృశ్యం. మంచి ముంబై నగరవాసులు' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా స్పందించారు. వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(BMC) వారిని ట్యాగ్ చేశారు. 'ఇది చూడటం చాలా బాధగా ఉంది. మౌలిక సదుపాయాలు ఎంతబాగున్నా మనం మన అలవాట్లను మెరుగుపరుచుకుంటే తప్ప సానుకూలమైన మార్పులు ఉండవు'అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వెంటనే అలర్ట్ అయ్యింది. ట్యాక్సీ నెంబర్ ఆధారంగా సముద్రంలో వ్యర్థాలు వేసిన వారిని గుర్తించింది. ఆ వ్యక్తి పేరు హాజీ అబ్దుల్ రెహమాన్ షా ఖాద్రీ అని పేర్కొంది. అతనికి 10వేల జరిమానా కూడా విధించింది.

ఇది కూడా చదవండి: Doctor: ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. ఎమర్జెన్సీగా అవయవ మార్పిడి.. అంబులెన్స్‌లో వస్తోంటే యాక్సిడెంట్..!


Updated Date - 2023-11-23T13:06:49+05:30 IST