Viral Video: బాబోయ్ బ్రతికున్న రొయ్యలతో సలాడ్.. ఇదేం ఘోరం అంటున్న నెటిజన్స్..

ABN , First Publish Date - 2023-03-01T16:18:53+05:30 IST

బ్రతికున్న రొయ్యల(Live Shrimps)తో సలాడ్ తయారుచేస్తున్నారు. ఓ వ్యక్తి ఈ సలాడ్ టేస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Viral Video: బాబోయ్ బ్రతికున్న రొయ్యలతో సలాడ్.. ఇదేం ఘోరం అంటున్న నెటిజన్స్..

ఈ ప్రపంచంలో ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు(Food Habbits) ఉంటాయి.మనం సాధారణంగా సలాడ్(Salad) పేరుతో చేసుకునే వంటకం ఎలా ఉంటుంది? వెజిటబుల్ సలాడ్(Vegetable Salad) అయితే పచ్చిగా తినదగిన కూరగాయల ముక్కలతో నిమ్మరసం(Lemon Juice), మిరియాల పొడి(Pepper Powder), ఉప్పు(Salt) వంటివి జతచేస్తారు. ఫ్రూట్ సలాడ్(Fruit Salad) అయితే ఫ్రూట్స్ ముక్కలుగా చేసి ఛాట్ మసాలాతో చేస్తారు. ఇప్పుడు బ్రతికున్న రొయ్యల(Live Shrimps)తో సలాడ్ తయారుచేస్తున్నారు. ఓ వ్యక్తి ఈ సలాడ్ టేస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించి వివరంగా తెలుసుకుంటే..

చైనాలో మాంసం అమ్మే మార్కెట్లను సోషల్ మీడియాలో చూసే ఉంటారు. బాబోయ్ దారుణం అని మనకు అనిపిస్తుంది కానీ వారికి మాత్రం అది చాలా కామన్ విషయం. థాయ్ ల్యాండ్(Thailand) వెళ్తే సజీవంగా ఉన్న జీవులను లొట్టలేస్తూ కనిపిస్తారు అక్కడి ప్రజలు. మరీ ముఖ్యంగా రొయ్యలు బ్రతికుండగానే సలాడ్ తయారుచేసి మనం మరమరాలను నమిలినట్టు నమిలేస్తున్నారు. సామ్ పెప్పర్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను sampepper అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ లో చేశాడు.

Read also: Viral Video: పెద్దమనసు చాటుకున్న ఫుట్ బాల్ అభిమానులు.. గ్రౌండ్ లో ఏం చేశారంటే..


ఈ వీడియోలో థాయ్ ల్యాండ్ లో సలాడ్ తయారు చేయడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, నిమ్మరసం, ఇతర పదార్థాలు వేసి చివరగా పక్కనే ట్యాంకర్ లో ఉన్న రొయ్యలను చిన్న నెట్ సహాయంతో తీసి సలాడ్ లో వేశారు. తరువాత సలాడ్ కంటైనర్ మూత క్లోజ్ చేసి బాగా షేక్ చేసి దానిని అందిస్తున్నారు. బ్రతికున్న రొయ్యలతో సలాడ్ అంటూ వీడియోలో వ్యక్తి స్పూన్ తో ఈ సలాడ్ ను తిన్నాడు. తిన్న తరువాత రొయ్యలు అతని నోట్లో కరిచాయని తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చెయ్యగానే నెటిజన్స్ కళ్ళలో పడింది. ఇది చాలా క్రూరమైన చర్య అంటున్నారు. కొందరు మాత్రం ఆసక్తిగా ఉంది ట్రై చెయ్యాలి అని ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.

Updated Date - 2023-03-01T16:18:53+05:30 IST