Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!
ABN , First Publish Date - 2023-11-03T12:14:38+05:30 IST
భార్యాభర్తల మధ్య గొడవ (Couple fighting) తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Viral Video: భార్యాభర్తల మధ్య గొడవ (Couple fighting) తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. భర్త చేతిలో సూట్‌కేసుతో బయటకు పనిపై వెళ్తుంటే.. భార్య అడ్డగిస్తుంది. దాంతో భర్త చేతిలో ఇటుక పట్టుకుని ఆమెను కొట్టేందుకు వెళ్తాడు. ఆ తర్వాత ఇటుక కిందపడేసి మళ్లీ సూట్‌కేసు చేతపట్టుకుని ముందుకు వెళ్లబోయాడు. ఇంతలో భర్త కిందపడేసిన అదే ఇటుక (Brick) తీసుకుని అతనిపై దాడికి యత్నిస్తుంది భార్య. దాంతో భర్త తప్పించుకుని ఆమెపై చేయి చేసుకోవడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను 'ఘర్ కే కలేష్' (Ghar Ke Kalesh) అనే 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
YouTube: మొత్తానికి యూట్యూబ్ భలే షాకిచ్చిందిగా.. యాడ్స్ రాకుండా టెక్నిక్స్ వాడే వాళ్లకు..!
"భార్యాభర్తల మధ్య గొడవ. భార్యకు చెప్పకుండా భర్త తిరిగి పనికి వెళ్తుండడంతో మొదలైంది అసలు ఘర్షణ" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. వీడియో చూస్తుంటే పక్కా స్క్రిప్టేడ్ అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. కాకపోతే చాలా ఫన్నీగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) బాగా వైరల్ అవుతోంది. వీడియోకు ట్విటర్లో 5లక్షల వరకు వ్యూస్, 4వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కిచెన్ చిమ్నీని ఆర్డర్ ఇచ్చాడో వ్యక్తి.. పార్శిల్ ఇంటికి వచ్చాకా ఓపెన్ చేస్తే కనిపించిన దృశ్యం చూసి..!
ఇక వీడియో చూసిన నెటిజన్లు దీనిపై అంతే ఫ్నన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఇది ఇష్టపడి చేసుకున్న గొడవ. దీని పార్ట్-2 ఉందా?' అంటూ ఓ యూజర్ అడిగారు. 'వాళ్లిద్దరూ కామెడీ చేస్తున్నారు. నేను అనుకోవడం ఇది స్కిట్ కావొచ్చు' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'పెళ్లి తర్వాత నేనైతే భార్యతో ఇలాంటి గొడవ అస్సలు పడను. దాని బదులు విడాకులు తీసుకుంటా' అని ఇంకోకరు అన్నారు. 'పాకిస్థాన్ జట్టు ఇంటికెళ్లేందుకు రెడీ అయింది. కానీ, న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా తన ఆటతీరుతో పాక్ జట్టును ఆపేందుకు ప్రయత్నించినట్టు ఉందని' మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకేందుకు ఆలస్యం భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.