Viral Video: మెట్రో రైల్లో కింద కూర్చుని ఈ కుర్రాళ్లు ఏం చేస్తున్నారనే కదా మీ డౌట్.. అసలు వీళ్లెవరో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-05-24T16:40:03+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీ అంటే ఎంత రద్దీగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఫుల్ రష్‌గా సాగిపోతాయి ప్రయాణాలు. అలాంటి మెట్రో రైళ్లో
సహజంగా పట్టణాల్లో బస్సులు గానీ.. రైళ్లు గానీ ఖాళీగా ఉండవు. నిత్యం ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఇక మెట్రో రైళ్లు వచ్చాక.. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడేకంటే త్వరగా గమ్యం చేరేందుకూ చాలా మంది మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. అవి కూడా ఖాళీగా ఉండవు.. కాకపోతే తక్కువ సమయంలోనే గమ్యానికి చేరిపోతామన్న ఆలోచనతో ఎక్కువగా మెట్రో రైల్లో జర్నీ చేస్తుంటారు. చాలా మంది కూర్చోకుండానే.. కొద్ది సేపు నిలబడి గమ్యం చేరుకుంటుంటారు. ఇదంతా ఎందుకంటారా? మెట్రో రైల్లో చోటుచేసుకున్న తాజా సంఘటన ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎక్కడా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
దేశ రాజధాని ఢిల్లీ అంటే ఎంత రద్దీగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఫుల్ రష్‌గా సాగిపోతాయి ప్రయాణాలు. అలాంటి మెట్రో రైళ్లో ముందు బాంబులు వీరంగం సృష్టించడం ప్రయాణీకులను కలవరానికి గురి చేసింది. ట్రైన్ అంటే పిల్లల దగ్గర నుంచీ ఆడవాళ్లు.. పెద్దవాళ్లు ఎంతో మంది ఎక్కి జర్నీ చేస్తుంటారు. అలాంటి ఢిల్లీ మెట్రోలో గత కొంతకాలంగా ఆకతాయిలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిత్ర విచిత్ర చేష్టలతో తోటి ప్రయాణికులకు చిరాకు పుట్టిస్తున్నారు. కొందరు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి రావటంతో ఢిల్లీ మెట్రో అధికారులు దృష్టిసారించారు. అలాంటి వెకిలీ చెష్టలు చేస్తున్న వారిపట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ మెట్రో మరో సంఘటన ప్రయాణీకుల్ని కలవరపెడుతోంది.
ఢిల్లీ మెట్రోలో (Delhi metro train) ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబుల వీరంగాన్ని తోటి ప్రయాణికులు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (Viral Video). రైలు బోగీలో కింద కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు వీడియోలో కనిపించింది. వీడియోపై డీఎంఆర్‌సీ(DMRC)ని ట్యాగ్ చేస్తూ ప్రయాణీకుడు అనురాగ్ దూబే నిలదీశాడు.
ఈ రకమైన తాగుబోతులను (Drug lords) మెట్రోలో ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డీఎంఆర్‌సీ ఘటన జరిగిన కోచ్ నంబర్‌ను తెలుసుకోవాలని కోరింది. పటేల్ నగర్, రాజేంద్ర ప్యాలెస్ స్టేషన్ల మధ్య ఉన్న మెట్రో బ్లూ లైన్‌లో ఈ వీడియోను రికార్డు చేశానని బదులిచ్చారు. మందుబాబులు కరోల్ బాగ్ వద్ద మెట్రో దిగారు. మీరు మీ సీసీటీవీని చెక్ చేసుకోవచ్చునని సూచించారు. ఇక నెటిజన్లు మందు బాబులపై మండిపడుతున్నారు. వీళ్లేప్పుడు మారతర్రా బాబు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.