Viral Video: బాబోయ్ కొండముచ్చుకు ఇంత ఆవేశమా? సింహాన్ని సింగిల్ గా ఉరికించింది..

ABN , First Publish Date - 2023-08-15T11:21:51+05:30 IST

ఓ కొండముచ్చు ఏకంగా లయన్ కింగ్ అయిన సింహాన్ని చీల్చి చెండాడింది. సింహాన్ని తోక ముడిచి పారిపోయేలా చేసింది.. దీని కోపాన్ని చూస్తే..

Viral Video: బాబోయ్ కొండముచ్చుకు ఇంత ఆవేశమా? సింహాన్ని సింగిల్ గా ఉరికించింది..

అడవి జంతువుల జీవితం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అడవుల్లోనూ, జనజీవన ప్రాంతాల్లో నివసించగలిగే జంతువులు కోతులు. వీటిలో కొండముచ్చులు ప్రత్యేకమైనవి. వీటి ముఖం ఎర్రగా సాధారణ కోతులకంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. వీటికి కోపం కూడా ఎక్కువే.. ఎవరైనా వీటి జోలికి వెళితే చీల్చి చెండాడుతాయి. ఓ కొండముచ్చు ఇప్పుడు అదే పని చేసింది. మనుషులనో, చిన్నచిన్న ప్రాణులనో కాదు, ఏకంగా లయన్ కింగ్ అయిన సింహాన్ని చీల్చి చెండాడింది. సింహాన్ని తోక ముడిచి పారిపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'కొండముచ్చు దెబ్బ.. సింహం అబ్బా..' అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

అడవికి రాజు సింహం(Lion) అనే విషయం చిన్నప్పటి నుండి పాఠాల్లోనూ, కథల్లోనూ తెలుసుకున్నదే. దీనికి తగ్గట్టు సింహం బలం, ధైర్యం, వేటలో నైపుణ్యం అన్నీ సింహాన్ని అన్ని జంతువులకంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే రాజునైనా ఓటమి వదలదన్నట్టు సింహానికి ఓటమి తప్పలేదు. కాకపోతే కొండముచ్చు(Baboon) చేతిలో సింహానికి పరాభవం ఎదురైంది ఇక్కడ. వీడియోలో అడవిలో విశాలమైన ప్రాంతంలో ఓ మగ కొండముచ్చు తన పిల్లలు, భాగస్వామితో కలిసుంది. అక్కడికి ఓ సింహం వచ్చింది. కొండముచ్చులు సింహం(Lion) కంట పడ్డాయి. ఎలాగైనా సరే కొండముచ్చులను వేటాడాలని ఆ సింహం ఫిక్సైంది. మగ కొండముచ్చు కాస్త దూరంగా వెళ్లిన సమయంలో సింహం కొండముచ్చుల మీద దాడిచేసింది(Lion attack on baboon troop). దూరం నుండి ఈ సంఘటన మొత్తం చూసిన మగ కొండముచ్చు కోపంతో రగిలిపోయింది. తన బిడ్డల మీద దాడి చేస్తున్న సింహాం మీదకు ఒక్కసారిగా పరుగుతీసింది. మగ కొండముచ్చును కూడా ఓ పట్టు పట్టాలని అనుకున్న సింహం ఆలోచనలు క్షణాల్లోనే తారుమారయ్యాయి. మగ కొండముచ్చు కోపం, ఆవేశం, బలం ముందు సింహం నిలవలేకపోయింది. కొండముచ్చు దాడిని భరించలేక ఆ సింహం తోక ముడిచి అక్కడి నుండి వేగంగా పారిపోయింది.

White Hair: ఏవి పడితే వాటిని వాడకండి.. కెమికల్స్‌కు బదులుగా వీటిని వాడితే తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!



ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'కొండముచ్చు దెబ్బకు సింహం అబ్బా అని పారిపోయింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ సింహం ఇంకా చిన్నది. దానికి వేటాడటం, ఎదురుదాడి చేయడం తెలిసినట్టు లేదు' అని మరొకరు అన్నారు. 'ఆ సింహం ఇంకోసారి ఇలాంటి పని చేయడానికి దైర్యం చేయదు' అని ఇంకొకరు అన్నారు. 'ఆ కొండముచ్చు దైర్యం మాములుగా లేదు' అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన పనేంటంటే..!


Updated Date - 2023-08-15T11:21:51+05:30 IST