Viral Video: వామ్మో.. ఇదేం టెక్నిక్ బాబోయ్.. నోట్ల కట్టకు వేసిన సీల్ తీయకుండానే రూ.500 నోటును ఓ వ్యక్తి ఎలా తీశాడో చూస్తే..

ABN , First Publish Date - 2023-06-08T11:24:03+05:30 IST

ప్రస్తుతకాలంలో ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బే కష్టపడి సంపాదించుకున్న డబ్బు విషయంలో మోసపోవడం ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ చాలా చోట్ల డబ్బు కారణంగానే మోసాలు జరుగుతాయి. బ్యాంకులలో ఎక్కువ మొత్తం డబ్బుడ్రా చేసుకున్నప్పుడు, ఎవరితోనైనా అప్పు తీసుకున్నప్పుడు ఫైనాన్స్ లలో లోన్తీసుకున్నప్పుడు కట్టలకొద్ది కరెన్సీ ఇస్తుంటారు. అయితే కరెన్సీ కట్టలకు సీల్ఉం ది కదా అని

Viral Video: వామ్మో.. ఇదేం టెక్నిక్ బాబోయ్.. నోట్ల కట్టకు వేసిన సీల్ తీయకుండానే రూ.500 నోటును ఓ వ్యక్తి ఎలా తీశాడో చూస్తే..

రోజువారీ చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్ చెల్లింపులలో చక్కబెట్టేస్తుంటాం. కానీ ఎక్కువ మొత్తం డబ్బు అవసరమైతే బ్యాంకులకు వెళ్ళి విత్ డ్రా చెయ్యాల్సిందే. పెద్ద మొత్తం డ్రా చేసినప్పుడు నోట్లను కట్టలుగా ఇస్తుంటారు. అలాగే ఇతరులతో అప్పు తీసుకున్నప్పుడు కూడా సీల్ వేసిన నోట్ల కట్టలు ఇస్తుంటారు. బ్యాంకు వారు క్యాష్ సరిగానే ఉన్నాయా లేదా చూసుకోమని బ్యాంకులోనే హెచ్చరిక బోర్డు పెట్టి ఉంటారు కూడా. కానీ సీల్ వేసిన కట్టలు కదా నోట్లు సరిగానే ఉంటాయిలే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారు ఈ వీడియో చూశారంటే మాత్రం అవాక్కవుతారు. నోట్ల కట్టకు వేసిన సీల్ తీయకుండా ఓ వ్యక్తి 500రూపాయల కట్టలో నుండి ఒక నోటును ఎలా బయటకు తీశాడో చూసారంటే అవాక్కవుతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'వామ్మో ఇంత ఈజీగా డబ్బు నొక్కేస్తారా?' అని షాకవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతకాలంలో ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బే(money). కష్టపడి సంపాదించుకున్న డబ్బు విషయంలో మోసపోవడం ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ చాలా చోట్ల డబ్బు కారణంగానే మోసాలు జరుగుతాయి. బ్యాంకులలో ఎక్కువ మొత్తం డబ్బుడ్రా చేసుకున్నప్పుడు, ఎవరితోనైనా అప్పు తీసుకున్నప్పుడు(money debit), ఫైనాన్స్ లలో లోన్(loans) తీసుకున్నప్పుడు కట్టలకొద్ది కరెన్సీ ఇస్తుంటారు. అయితే కరెన్సీ కట్టలకు సీల్(seal on currency bundle) ఉంది కదా అని నిర్లక్ష్యం చెయ్యడం తగదు. ఓ వ్యక్తి స్టేట్ బ్యాంక్ లో డ్రా చేసిన 500రూపాయల నోట్ల కట్టను చేతుల్లో పట్టుకుని ఉండటం వీడియోలో చూడచ్చు. ఆ నోట్ల కట్టకు ఇంకా సీల్ కూడా తీయలేదు. సీల్ తీయని నోట్ల కట్ట మధ్యలో అతను ఒక జాటర్ పెన్(man insert Jatter pen in currency bundle) దూర్చాడు. పెన్ కు పైభాగంలో పాకెట్ లో పుష్ చేయడానికి సపోర్ట్ గా ఉండే పిన్ లోకి నోటును సెట్ చేశాడు. ఆ తరువాత ఆ పెన్ ను వృత్తాకారంలో తిప్పుతూ(pen move in circle way) ఉంటే కట్టలో ఉన్న నోటు పెన్ కు చుట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆ తరువాత పెన్ ను బయటకు తీయగానే 500నోటు బయటకు వచ్చేసింది. ఇలా సీల్ తీయకుండానే నోట్ల కట్ట నుండి నోటు వేరు చేసేస్తున్నారు.

Viral News: అయ్యా.. నా కూతురు పది పాస్ అయిందంటూ సంతోషాన్ని పంచుకుందో పనిమనిషి.. ఆ యజమాని ఏం చేశారో మీరే చూడండి..!


ఈ వీడియోను Finance Memes అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఇది ఇండియా బాబూ.. ఇక్కడ ఇలాగే ఉంటుంది' అని ఫన్నీగా కామెంట్ చేశారొకరు. 'ఇలా చేయడం నిజమే అయినా బ్యాంకులలో ఇలాంటి మోసం జరగదు. బ్యాంక్ క్యాష్ కౌంటర్ నుండి డ్రా చేసుకున్నప్పుడు నోట్లు సరిగ్గా ఉంటాయి. డబ్బు డ్రా చేసినవారు నోట్లు నొక్కేసి ఇతరులను అలా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది' అని మరొకరు అన్నారు. 'వామ్మో డబ్బును మరీ ఇంత స్మార్ట్ గా కొట్టేస్తున్నారా?' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: వామ్మో పిల్లులకు ఇంత ధైర్యం ఉంటుందా? ఈ వీడియో చూశారంటే షాకవడం పక్కా..


Updated Date - 2023-06-08T11:24:03+05:30 IST