Viral Video: బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపేసి.. వెంటనే తాళం లాగేసుకున్న పోలీసులు.. అతడు ఇచ్చిన ట్విస్టుతో అంతా షాక్..!
ABN , First Publish Date - 2023-07-24T11:53:18+05:30 IST
హెల్మెంట్ ధరించకపోవడంతో ఓ వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆపి తాళాలు లాగేసుకున్నారు పోలీసులు. కానీ ఆ తరువాత అతను పోలీసులకు ఊహించని షాకిచ్చాడు.
హెల్మెట్ లేని బైక్ ప్రయాణం ప్రాణాలకు ప్రమాదం. అంతేకాదు ట్రాఫిక్ రూల్స్ దృష్ట్యా ఇది నేరం కూడా. ట్రాఫిక్ పోలీసులు హెల్మెంట్ లేకుండా ప్రయాణించేవారిని అడ్డుకుని చలానా విధిస్తారు. ఈ పోలీసులు కూడా అదే విధంగా రోడ్డుకు ఒకవైపు నిలబడుకుని హెల్మెట్ లేకుండా ప్రయాణ్ంచేవారి బైక్ లు ఆపి వారికి చలానా వేయడం, వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. అప్పుడే దూరంగా రాయల్ ఎన్ఫీల్ట్ బైక్ మీద ఓ వ్యక్తి వస్తూ కనిపించాడు. అతను హెల్మెంట్ ధరించకపోవడంతో అతని బైక్ ఆపారు. ఆ తరువాత తాళాలు లాగేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆ బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పోలీసులకు ఊహించని షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
భారతీయులకు వృథా చేయడమంటే అసలు నచ్చదు. ఇక ఇవి పనికిరావు అనుకునే వస్తువులతో అధ్బుతాలు చేస్తారు. శాస్త్రవేత్తల కంటే మెరుగ్గా ఆలోచిస్తారు. ఇలా పనికిరాని వస్తువులతోనూ, చెత్తతోనూ చేసిన ఆవిష్కరణలకు సంబంధించి ఎన్నో వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ప్రస్తుత వీడియో విషయానికి వస్తే.. పంజాబ్(Punjab) లో ట్రాఫిక్ పోలీసులు(Punjab traffic police) విధులలో భాగంగా హెల్మెంట్ లేకుండా ప్రయాణించేవారిని ఆపి చలాన్ వేయడం, బైక్ స్వాధీనం చేసుకోవడం చేస్తున్నారు. అప్పుడే రహదారి మీద రాయల్ ఎన్స్ఫీల్ బుల్లెట్(Royal enfield bullet) మీద ఓ వ్యక్తి వచ్చాడు. అతను పోలీసులను చూసి తన వేగం తగ్గించాడు. పోలీసుల ముందుకు రాగానే ఆ పోలీసులు బైక్ లాక్ చేసి కీస్ లాగేసుకున్నారు. 'బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ఫిట్ గా ఇంటికి చేరలేవు' అంటూ అతన్ని మందలించారు. అయితే అతను మాత్రం 'నేను ఫిట్ గా ఉండేందుకు ఈ బైక్ ఏ కారణం' అని సమాధానం ఇచ్చాడు. పోలీసులకు కోపం వచ్చినా అతని వంకా, బైక్ వంకా మార్చి చూశాక వాళ్లకు బైక్ లో ఏదో తేడా కనిపించింది. 'ఇది మోటార్ బైకా'అని ఓ పోలీసు అతడిని అడిగాడు. 'కాదు' అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత మరొక పోలీసు బైక్ కు ఇవతలివైపుకు వచ్చి 'దీని ఇంజన్ ఏదీ' అని అడిగాడు. 'దీనికి ఇంజన్ లేదు' అని సమాధానం చెప్పాడు. ఆ తరువాత ఒక పోలీసు ఆ బైక్ కు ఉన్న సైకిల్ పెడల్స్ చూసి అవాక్కయ్యాడు. దాన్ని చేత్తో పట్టుకుని తిప్పి విస్తుపోయాడు. 'మా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వేస్టేజ్ ఉంది. దాన్ని అలాగే ఉంచడం ఇష్టం లేక సైకిల్ కి అమర్చి బుల్లెట్ సైకిల్(Royal enfield bullet cycle) గా మార్చాము. ఈ సైకిల్ బరువుగా ఉంటుంది. దీన్ని తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది' అని చెప్పాడతను. ఈ మాట వినగానే నోరెళ్లబెట్టడం ట్రాఫిక్ పోలీసుల వంతైంది. ఆ తరువాత అతన్ని వదిలేశారు.
Health Tips: ఎక్కువ మొత్తం పాల ప్యాకెట్స్ తెచ్చి వాడుకునే అలవాటుందా? ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజాలివీ..
ఈ వీడియో Mahammad shuaib అనే ట్విట్టర్(twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సైకిల్ కు బైక్ టైర్లు, బైక్ సీటర్, లుక్ కోసం పెట్రోల్ ట్యాంకర్, సైలెన్సర్ వంటివన్నీ అమర్చి ఉండటం చూసి కళ్లు తేలేస్తున్నారు. 'బుల్లెట్ సైకిల్ భలే ఉంది' అని కామెంట్ చేస్తున్నారు. 'వీళ్శ ఆవిష్కరణ అద్భుతంగా ఉంది. వీళ్ళకు అవార్డ్ ఇవ్వాలి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఇంజిన్ లేకపోయినా లుక్ కోసం సైలెన్సర్ పెట్టారు. మీరు గ్రేట్ భయ్యా ' అని మరొకరు అన్నారు. సైకిల్ ప్రియులు ఈ బుల్లెట్ సైకిల్ చూసి ఫిదా అవుతున్నారు.