Share News

Viral Video: ఈ రిక్షావాలా క్రియేటివిటీ వేరే లెవల్.. ఇతను రిక్షాను ఎలా మార్చేశాడో చూస్తే..

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:48 PM

తమ దగ్గర ఏవైనా వస్తువులు లేకపోతే బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ తమదగ్గరున్న వస్తువులను తమకు నచ్చినట్టు మార్చుకుని తృప్తి పడేవారు అరుదుగా ఉంటారు. ఈ రిక్షావాలా కూడా ఆ కోవకు చెందినవాడే..

Viral Video: ఈ రిక్షావాలా క్రియేటివిటీ వేరే లెవల్.. ఇతను రిక్షాను ఎలా మార్చేశాడో చూస్తే..

తమ దగ్గర ఏవైనా వస్తువులు లేకపోతే బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ తమదగ్గరున్న వస్తువులను తమకు నచ్చినట్టు మార్చుకుని తృప్తి పడేవారు అరుదుగా ఉంటారు. ఈ రిక్షావాలా కూడా ఆ కోవకు చెందినవాడే.. తన రిక్షాను ఇతను మార్చిన విధానం చూస్తే షాకవడం పక్కా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విస్తుపోతున్నారు. "ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంటి భయ్యా..!" అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సాధారణ వ్యక్తుల ఆలోచనలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. అవసరానికి తగ్గట్టు తమ మేధస్సును ఉపయోగించడం సగటు భారత పౌరుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి ఆవిష్కరణలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. ఓ రిక్షావాలా చేసిన ప్రయోగం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అతను రిక్షాను ఏకంగా కారులా మార్చేశాడు. వీడియోలో ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. అయితే అతనికి చుట్టూ గోనె సంచులు, పాత బట్టలు, ఇనుప రాడ్ లు కనిపిస్తాయి. రిక్షావాలా ఇనుప రాడ్ లను, కర్రలను కారు ఆకారంలో పేర్చాడు. వీటికి అట్టముక్కలను, గోనె సంచులన, పాత బట్టలను సెట్ చేశాడు. కారు ముందు భాగంలో ఉండేలా హెడ్ లైట్లు కూడా అమర్చాడు. అతను కారు ఆకారం మధ్యలో సైకిల్ మీద కూర్చుని తొక్కుతోంటే కారు ముందుకు పోతున్నట్టే అనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే లెమన్ టీ తాగితే ఎన్ని లాభాలో..!!


ఈ వీడియోను msb_005 అనే ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. వీడియోకు చేసిన ట్యాగ్ ల ప్రకారం ఈ రిక్షావాలా పంజాబ్ కు చెందిన వాడని అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. కొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుండగా మరికొందరు మాత్రం లేని దాన్ని తనకు తోచినట్టు సృష్టించుకుని తృప్తి పడటం అంటే ఇదే.. అని తత్త్వం చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Health Tips: ఖర్జూరం, నెయ్యి.. ఈ సీక్రెట్ కాంబినేషన్ గురించి తెలుసా? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..!


Updated Date - Dec 14 , 2023 | 01:48 PM