Viral Video: ఓరి దేవుడో.. దీన్ని ఎలా తింటున్నార్రా నాయనా..? ఇడ్లీలతో ఇలాంటి ప్రయోగాలేంటి..?
ABN , First Publish Date - 2023-10-27T10:01:21+05:30 IST
ఇడ్లీని ఇడ్లీలా తింటే పర్లేదు కానీ ఓ వీధి వ్యాపారి మాత్రం ఇడ్లీతో ప్రయోగాలు చేసి దాన్ని వెరైటీ వంటకంగా మార్చేశాడు. దీని తయారువిధానం చూస్తే..
ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన టిఫిన్. దక్షిణాది అల్పాహారంలో ఇడ్లీకి ప్రత్యేకస్థానం ఉంది. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సంకోచం లేకుండా తినగలిగే టిఫిన్ ఇది. ఇక జ్వరమొచ్చినా, జబ్బు చేసినా డాకర్టర్లు బ్రెడ్, పాలు, ఇడ్లీ తినొచ్చంటూ లిస్ట్ చెబుతారు. ఇడ్లీ, చెట్నీ, సాంబార్ చాలా మంది ఫేవరెట్ టిఫిన్ కూడా. అయితే ఇడ్లీని ఇడ్లీలా తింటే పర్లేదు కానీ ఓ వీధి వ్యాపారి మాత్రం ఇడ్లీతో ప్రయోగాలు చేసి దాన్ని వెరైటీ వంటకంగా మార్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఆరోగ్యకరమైన ఇడ్లీతో ఈ ప్రయోగాలేంటి .. అసలు దాన్ని ఎలా తింటున్నార్రా బాబు?' అని ఇంతెత్తున విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో ఇడ్లీ(idly) ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోతే వాటితో ఇడ్లీ ఉప్మా తయారుచేస్తుంటారు. కొంతమంది ఇడ్లీ ముక్కలను డీప్ ఫ్రై చేసి ఉప్పు, మిరియాలపొడి చల్లుకుని స్నాక్ లాగా తింటుంటారు. కానీ ఓ వీధి వ్యాపారి మాత్రం ఇడ్లీతో ఏకంగా కీమా(idly keema) తయారుచేశాడు. వీడియోలో వీధులలో ఆహారం విక్రయించే వ్యాపారి పెద్ద పెనం మీద ఇడ్లీలను పెడతాడు. వాటిమీద వెన్న, మసాలా పొడులు వేసి ఇడ్లీలను వేయిస్తాడు. ఆ తరువాత ఇడ్లీలను కాస్త పెనం చివరలకు జరిపి పెనం మధ్యలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, వెన్న, బంగాళాదుంప కూర, మసాలా పొడి వేసి బాగా కలిపి దాని మీద మూతపెట్టి ఉడికిస్తాడు. ఆ తరువాత మూత తీసి పప్పును మెదిపినట్టు ఆ మిశ్రమాన్ని బాగా మెదుపుతాడు. పక్కన ఉన్న ఇడ్లీలను గ్రేవీ మీద ఉంచి ఆ తరువాత ఇడ్లీలను ముక్కల ముక్కలు చేస్తాడు. దీన్ని బాగా కలిపి కొత్తిమీర వేసి మళ్లీ పప్పులాగా మెదుపుతాడు. అంతే ఇడ్లీ కీమా తయారైపోయినట్టే. ఈ కీమాను చెట్నీ, సాంబార్ తో సర్వ్ చేస్తున్నాడు.
Viral News: 1300 ఏళ్ల క్రితం నాటి మానవ శరీరంపై.. ఈ వింత రాతలేంటి..? ఈ టాటూను చూసి శాస్త్రవేత్తలే అవాక్కవడం వెనుక..!
ఈ వీడియోను thegreatindianfoodie అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో షేర్ చేశారు. 'మీరు ఎప్పుడైనా ఇడ్లీ కీమా తిన్నారా?' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా అనారోగ్యంగా మార్చాలో ఇతను చూపిస్తున్నాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతని అడ్రస్ పెట్టండి' అంటూ ఇంకొకరు స్పందించారు. 'అతన్ని తాలిబన్ లలోకి పంపండి' అని మరొకరు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'దయచేసి ఇడ్లీని ఇలా చేయకండి' అని చాలామంది ఇడ్లీ లవర్స్ బాధపడుతున్నారు.