Viral Video: విమానం ఎక్కగానే కళ్ల ముందు ఊహించని సీన్.. పట్టరాని ఆనందంతో ఈ మహిళ కేకలు వేయడం వెనుక..!

ABN , First Publish Date - 2023-08-02T14:52:27+05:30 IST

ఒక్కోసారి ప్రయాణాలలో ఊహించని సంఘటనలు కొన్ని చోటుచేసుకుంటూ ఉంటాయి, ఈ మహిళకూ అలాంటి అనుభవమే ఎదురయ్యింది.

Viral Video: విమానం ఎక్కగానే కళ్ల ముందు ఊహించని సీన్.. పట్టరాని ఆనందంతో ఈ మహిళ కేకలు వేయడం వెనుక..!

దూరప్రాంతాలను తొందరగా చేరుకోవడానికి, దేశాలు దాటి ప్రయాణించడానికి విమాన ప్రయాణం సౌకర్యవంతమైనది. ఇప్పట్లో సాధారణ ప్రజలు కూడా చేయగలిగేవిధంగా ఈ ప్రయాణ పరిస్థితులు మార్పు చెందాయి. ఒక్కోసారి ఇలాంటి ప్రయాణాలలో ఊహించని సంఘటనలు కొన్ని చోటుచేసుకుంటూ ఉంటాయి, ఈ మహిళకూ అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఆమె విమాన ప్రయాణం చేసేందుకు విమానం ఎక్కగానే కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. పట్టరాని సంతోషంతో చిన్నపిల్లలా కేకలు వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆ మహిళ సంతోషాన్ని చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ కోరిక నిజమై కళ్ళముందు నిలిచిన సందర్భంలో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఓ మహిళ(women) విమాన ప్రయాణం చేయడానికి విమానం ఎక్కింది. ఆమె ఎంట్రీ డోర్ లో అలా అడుగు పెట్టిందో లేదో ఆమె ఎదురుగా విమాన ఫైలట్ నిలబడి ఆమెను ఆహ్వానించాడు. అతను ఆమె కొడుకు(pilot is women son). ఆ రోజు ఆ మహిళ ప్రయాణించే విమానానికి పైలట్ కూడా అతడే. కొత్తగా ఫైలట్ అయిన అతను తన తల్లికి సర్ఫ్రైజ్ ఇవ్వడానికి అలా ప్లాన్ చేశాడు(son surprise to his mother). అందులో భాగంగా తల్లిని ఎయిర్ హోస్టెస్ ప్లేస్ లో అతనే స్వయంగా ఆహ్వానించాడు. ఆ మహిళ తన కొడుకును చూడగానే ఆశ్చర్యపోయింది. తను ప్రయాణించే విమానాన్ని తన కొడుకే నడుపబోతున్నాడని ఆమెకు అర్థమైంది. దీంతో చిన్నపిల్లలా సంబరపడిపోయింది. చెప్పలేనంత ఆనందంతో కేకలు వేస్తూ కొడుకును కౌగిలించుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది.

Tax Notice: ఇదేం ట్విస్ట్ బాబోయ్.. 10 ఏళ్ల క్రితమే చనిపోయిన మహిళకు ట్యాక్స్ నోటీస్.. రూ.7.56 కోట్ల పన్ను కట్టండంటూ..!



ఈ వీడియోను goodnews_movement అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లీకొడుకుల అనుబంధం చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. వారి సంతోషం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు. 'ఆ మహిళను చూస్తే అచ్చం నన్ను నేను చూసుకున్నట్టుంది. గాడిదలాగా తిరిగిన కొడుకు బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారినపుడు సంతోషం ఇలాగే ఉంటుంది' అని ఒక మహిళ కామెంట్ చేసింది. 'తన కొడుకును పైలట్ గా చూసిన తరువాత, ఆ మహిళ విమానంలో చాలామందితో నా కొడుకు పైలట్ అని గర్వంగా చెప్పుకుంటుంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'తల్లికి తన పిల్లల మీద ఉండే ప్రేమ ఇక వేరే దేనిమీదా ఉండదు' అని ఇంకొందరు స్పందిస్తున్నారు.

Viral: ఇదేం పనమ్మా తల్లీ.. అందం కోసం ఇల్లు అమ్ముకోవడమేంటి..? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు డబ్బుల్లేక..!


Updated Date - 2023-08-02T14:52:27+05:30 IST