Viral Video: బీచ్ ఒడ్డున సంతోషంగా భర్తతో వీడియో తీయించుకుంటున్న మహిళ.. సెకెన్ల వ్యవధిలోనే ఇంత ఘోరం జరుగుందని ఎవరూ ఊహించి ఉండరు..

ABN , First Publish Date - 2023-07-16T14:40:52+05:30 IST

ఎంతో సంతోషంగా భర్తతో ఫోటోలు దిగుతోంటే.. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి చప్పట్లు కొడుతున్నారు. కానీ అంతలోనే..

Viral Video: బీచ్ ఒడ్డున సంతోషంగా భర్తతో వీడియో తీయించుకుంటున్న మహిళ.. సెకెన్ల వ్యవధిలోనే ఇంత ఘోరం జరుగుందని ఎవరూ ఊహించి ఉండరు..

భార్య సంతోషమంతా భర్తతో గడిపే క్షణాల్లోనే దాగుంటుంది. కానీ ఆ సంతోషంలో విషాదం చోటుచేసుకోవడం నిజంగా దురదృుష్టం. ఓ మహిళ తన భర్త పిల్లలతో కలసి టూర్ కు వెళ్ళింది. ఆమె ఎంతో సంతోషంగా బీచ్ ఒడ్డున భర్తతో కలసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటోంది. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి చప్పట్లు కొడుతున్నారు. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. అందరూ చూస్తుండగానే కళ్లముందే పెద్ద ఘోరం జరిగిపోయింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చుతున్నాయి, హృదయాలు బాధతో బరువెక్కుతున్నాయి. ముంబైలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సంతోషం, దుఃఖం ఒకదాని వెనుక ఒకటి వస్తాయని చెబుతారు. కానీ సంతోషంగా ఉన్న వారి జీవితంలోకి దుఃఖం మరీ ఇంత తొందరగా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ముంబైలో(Mumbai) నివసించే ముఖేష్ అనే వ్యక్తికి తన భార్య పిల్లలతో కలసి 15రోజులకు ఒకసారి అయినా అలా సరదాగా బయటకు వెళ్ళడం అలవాటు. అందులో భాగంగానే అతను తన భార్య జ్యోతిని(32), తన ముగ్గురు పిల్లలను(three kids) తీసుకుని ముంబైలోని జుహూ చౌపట్టి బీచ్(juhu chowpatty beach) కు వెళ్ళాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ కాస్త పాడైపోయి వారు బాంద్రాకు వెళ్ళారు. బాంద్రా బీచ్(bandra beach) లో సముద్రపు అలలతోనూ, సముద్రపు ఒడ్డున ఇసుకలోనూ బాగా అల్లరి చేసి ఆడుకున్నారు. వారి సంతోషాన్ని మొబైల్ లో బంధించాలని మొబైల్ లో ఫోటోస్, వీడియోస్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పిల్లలు ముగ్గరు తల్లిదండ్రులకు ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారు.

Health Tips: బరువు తగ్గుతామనే భ్రమలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో తెలుసా? ఉదయాన్నే అందరూ తాగే ఈ డ్రింక్స్ వల్లనే..


వీడియోలో ముఖేష్, అతని భార్య జ్యోతి ఇద్దరూ సముద్రపు నీళ్లలో ఉన్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని ఫోటోలు, వీడియోస్ తీయించుకుంటున్నారు.ముఖేష్ అతని భార్య ఇద్దరూ వీడియోకు అటెన్షన్ ఇస్తూ వెనక అలలు(Waves) వస్తున్నా పట్టించుకోలేదు. రెండు మూడు సార్లు చిన్న అలలు వేగంగా వచ్చి వెళ్లాయి. అవేం చేస్తాయిలే అని వారు నిర్లక్ష్యం చేసారు. ఈ క్రమంలో ఒక పెద్ద అల(big wave) చాలా వేగంగా వచ్చి వారి మీద పడింది. ఆ వేగానికి ముఖేష్ అతని భార్య ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయారు. ముఖేష్ తన భార్యను కాపాడుకోవడం కోసం ఆమె చీరను పట్టుకున్నాడు కానీ ఆమె జారిపోయి నీటిలో గల్లంతైంది. ఈ పరిణామంతో పిల్లలు భయబ్రాంతులకు లోనయ్యారు. తల్లికోసం విలవిలలాడిపోయారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. వెంటనే పోలీసులకు, రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించినా ఫలితం లేదు. చివరికి జ్యోతి మృతదేహం పోలీసులకు లభ్యమైంది(found women dead body). నా భార్య చావుకు నేనే కారణం అంటూ ముఖేష్ రోధించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. గల్లంతైన తల్లికోసం పిల్లలు ఏడవడం కూడా వీడియోలో వినబడతాయి ఇవన్నీ కలిపి నెటిజన్ల హృదయాలను బరువెక్కిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను dekhbhai అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు.

Viral Video: బాగా ఆకలిగా ఉన్న చిరుత వేట ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే గుండెలు అదురుతాయి..


Updated Date - 2023-07-16T15:35:10+05:30 IST