స్నేహితుల కక్కుర్తితో ఆగిన పెళ్లి ఊరేగింపు.. వరుడు ఎంతకీ రాలేదని అంతా కంగారుపడుతుంటే.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

ABN , First Publish Date - 2023-02-19T17:09:37+05:30 IST

అనవరం అనుకున్న వాటి కోసం కక్కుర్తి పడితే కొన్నిసార్లు చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. చేసే పనిని వదిలిపెట్టి కొందరు అనవసరమైన పనుల కారణంగా చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా ఓ వరుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది..

స్నేహితుల కక్కుర్తితో ఆగిన పెళ్లి ఊరేగింపు.. వరుడు ఎంతకీ రాలేదని అంతా కంగారుపడుతుంటే.. చివరకు అతడు చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

అనవరం అనుకున్న వాటి కోసం కక్కుర్తి పడితే కొన్నిసార్లు చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. చేసే పనిని వదిలిపెట్టి కొందరు అనవసరమైన పనుల కారణంగా చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా, బీహార్‌లో ఓ వరుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ వైపు పెళ్లి ఊరేగింపు కోసం అంతా సిద్ధం చేశారు. వధువు కూడా పెళ్లి దుస్తుల్లో రెడీ అయ్యి.. వరుడి కోసం ఎదరు చూస్తూ ఉంది. అయితే ఎంత సేపు చూసినా వరుడు మాత్రం రాలేదు. స్నేహితుల కక్కుర్తి కోస అతడు చేసిన పని తెలసుకుని చివరకు అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) బగాహా పరిధి రాంనగర్ సమీపంలోని దాన్మార్వా అనే ప్రాంతానికి చెందిన సాజిద్ అనే యువకుడికి సమీప ప్రాంతానికి చెందిన యువతితో (young woman) వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి ఊరేగింపు (Wedding procession) కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అతిథులంతా చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడి సందడిగా ఉంది. మరోవైపు ఊరేగింపు కోసం అంతా సిద్ధం చేశారు. వధువు పెళ్లి దుస్తుల్లో ముస్తాబై.. వరుడి కోసం ఎదురుచూస్తోంది. అయితే ఎంతకీ వరుడు మాత్రం అక్కడికి రాలేదు. ఊరేగింపు సందర్భంగా పార్టీ ఇవ్వాలంటూ (Liquor party) వరుడి స్నేహితులు బలవంతం చేశారు. దీంతో మందు కోసం వరుడే స్వయంగా తన ఇద్దరు స్నేహితులతో (friends) కలిసి బైకుపై సమీప ప్రాంతానికి వెళ్లాడు.

నా కోసం ఏమైనా చేస్తావా.. అని ప్రేమికుల రోజున భార్యను అడిగిన భర్త.. ప్రాణమైనా ఇస్తా.. అని ఆమె అనడంతో మరుక్షణమే..

bihar-wedding-viral-news.jpg

అక్కడ మూడున్నర లీటర్ల మద్యం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అదే సమయంలో పోలీసులు వాహనాల తనిఖీలో (Police inspecting vehicles) ఉన్నారు. ఇందులో భాగంగా సాజిద్ బైకును ఆపి తనిఖీ చేశారు. మద్యం బాటిళ్లు ఉండడంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ‘‘సార్.. ఈ రోజు నా పెళ్లి.. ఊరేగింపు కోసం అంతా ఎదురుచూస్తున్నారు’’.. అని ఎంత బ్రతిమాలినా పోలీసులు వినిపించుకోలేదు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం తెలిసి వధువుతో పాటూ పెళ్లికి వచ్చిన బంధువులంతా షాక్ అయ్యారు. వరుడు జైల్లో ఉన్న కారణంగా చివరకు ఊరేగింపును రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అత్తారింటికి వెళ్తూ సడన్‌గా కారును ఆపమన్న నవ వధువు.. చెట్ల పొదల్లోకి వెళ్లి ఎంతకూ రాకపోవడంతో వరుడు కూడా వెళ్లి చూస్తే..

Updated Date - 2023-02-19T17:09:45+05:30 IST