Weight gain Food: ఎంత తిన్నా సరే.. కొందరికి ఒంట్లో పిడికెడు కండ కరువు.. అలాంటోళ్లు బరువు పెరగాలంటే..!
ABN , First Publish Date - 2023-08-07T17:07:33+05:30 IST
ఎంత తిన్నా సరే బక్కగా ఎముకలు బయటకు కనిపిస్తూ.. చూద్దామంటే పిడికెడు కండ లేకుండా ఉండేవారు చాలామందే ఉంటారు. సన్నగా ఉండటం మంచిదే అయినా.. మరీ పీలగా ఉంటే మాత్రం అది కూడా అనారోగ్యం కిందకే వస్తుంది.
ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అధిక బరువు కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, బరువు తగ్గే చిట్కాలు కావాలని మొరపెట్టుకునేవాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎంత తిన్నా సరే బక్కగా ఎముకలు బయటకు కనిపిస్తూ చూద్దామంటే పిడికెడు కండ లేకుండా ఉండేవారు చాలామందే ఉంటారు. సన్నగా ఉండటం మంచిదే అయినా.. మరీ పీలగా ఉంటే మాత్రం అది కూడా అనారోగ్యం కిందకే వస్తుంది. అందుకే బక్కగా ఉన్న చాలామంది బరువు పెరగడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణ ఆహారాలు బరువు పెరగడానకి సహాయపడవు. బరువు పెరగాలి అంటే ఈ కింది ఆహారాలు తీసుకోవాలి.(Weight gain foods)
బరువు పెరగడానికి ప్రోటీన్ ఫుడ్(protein) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కండర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారంలో సోయాబీన్(soya bean) మొదటిస్థానంలో ఉంది. సోయాబీన్ లో ప్రోటీన్లు మాత్రమే కాకుండా మినరల్స్, విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-ఎ వంటి పోషకాలు కూడా ఉంటాయి. బరువు పెరగడానికి ఇది ఎంతో సులువైన పరిష్కారం.
ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు(curd) కూడా బరువు పెరగడానికి సహకరిస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరంలో ప్రోటీన్ పేరుకుని పోకుండా శరీరం సరిగ్గా వినియోగించుకునేలా పెరుగు సహాయపడుతుంది. అయితే ఇంట్లోనే తయారుచేసిన పెరుగు వాడటం శ్రేయస్కరం.
Weight Loss: బరువు తగ్గడం యమా ఈజీనండీ బాబూ.. బెల్లంతో ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూశారా..?
బరువు పెరగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు గింజలు(seeds) తీసుకోవడం చాలా మంచిది. బాదం, శనగలు, జీడిపప్పు, వాల్నట్స్ వంటివి మాత్రమే కాకుండా ఖర్జూరం, అంజీర్ వంటి ఎండు పండ్లు కూడా బాగా సహకరిస్తాయి.
గుడ్డు(eggs) శరీర కండర నిర్మాణంలో సహాయపడుతుంది. అందుకే గుడ్డు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. రోజూ కనీసం రెండు గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా బరువు పెరగాలని అనుకునేవారు గుడ్డులోని పచ్చసొన వదలకుండా తినాలి. ఇది కండరాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.
తోటకూర(amaranthus leaves) శరీరానికి పోషణను ఇస్తూ బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా అరటిపండు(banana) బరువు పెరగడానికి తోడ్పడుతుంది. ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్, డైటరీ ఫైబర్, థయామిన్, ఫోలేట్, నియాసిన్, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మాంగనీస్, జింక్, సెలీనియం వంటి పోషకాలు అరటిపండులో లభిస్తాయి. అందుకే అరటిపండు రోజూ తినాలి.
ఎండుద్రాక్షను(raisins) పాలలో నానబెట్టి తరువాత మిల్క్ షేక్ చేసుకుని తాగినా, లేక సాధారణ పాలలో తేనె(milk with honey) కలుపుకుని తాగినా బరువు పెరుగుతారు. ఇందులో రాగి, ఐరన్, భాస్వరం, మెగ్నీషియం,కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఫూల్ మఖానా(pool makhana) మంచి పోషకాహారంగా పరిగణింపబడుతుంది. ఇందులో కొవ్వులు, చక్కెరలు తక్కువ కాబట్టి బరువు పెగనివ్వదు కానీ ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది.