ప్రేయసి గుర్తుగా వీడియోలు, ఫొటోలను దాచుకున్న ప్రియుడు.. అయితే చివరకు ప్రియురాలి తల్లి అలా అనడంతో..
ABN , First Publish Date - 2023-01-12T19:51:40+05:30 IST
ఓ యువకుడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఎలాగైనా పెళ్లి చేసుకుని, కలకాలం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆమె గుర్తుగా 2500 వీడియోలు, 250 ఫొటోలను దాచుకున్నాడు. అయితే..
ఓ యువకుడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఎలాగైనా పెళ్లి చేసుకుని, కలకాలం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆమె గుర్తుగా 2500 వీడియోలు, 250 ఫొటోలను దాచుకున్నాడు. అయితే ఇటీవల వీరి ప్రేమ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. ఓ రోజు బాలిక తల్లి.. సదరు యువకుడిని పిలిచి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు.. చివరకు ఏం చేశాడంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజ్‌గఢ్ జిల్లా ఖిల్చిపూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన దీపక్ మాల్వియా అనే యువకుడు ఎలక్ట్రీషియన్‌గా (Electrician) పని చేస్తుంటాడు. మూడేళ్ల క్రితం ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే బాలిక (girl) మైనర్ కావడంతో సమస్య తలెత్తింది. అందులోనూ వీరి ప్రేమ (love) విషయం బాలిక ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు.. మైనర్ సాకు చూపుతూ వీరి పెళ్లిని అడ్డుకున్నారు. తల్లిదండ్రుల భయంతో బాలిక కూడా మిన్నకుండిపోయింది. అయితే దీపక్ మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. దీంతో ఇటీవల ఓ రోజు బాలిక తల్లి.. సదరు యువకుడిని పిలిచి మందలించింది. ‘‘మా కూతుర్ని మర్చిపోకుంటే.. చంపేస్తాం’’.. అంటూ హెచ్చరించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు.. ఫుల్‌గా మద్యం తాగి వాటర్ ట్యాంక్ ఎక్కాడు.
మద్యం మత్తులో కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేశాడు. ఈ క్రమంలో కాలుజారి ట్యాంక్‌పైనే జారిపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్రగాయమైంది. ట్యాంకు పైనుంచి రక్తం కారుతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చి చూశారు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ప్రియురాలు లేకుండా తాను ఉండలేనని, పెళ్లి చేసుకునేందుకు సహకరించాలని వేడుకున్నాడు. తన వద్ద ప్రియురాలి గుర్తుగా దాచుకున్న 2500 వీడియోలు, 250 ఫొటోలను (Videos and photos) బయటపెట్టాడు. అంతా విన్న పోలీసులు.. బాలిక మేజర్ అయ్యేందుకు ఇంకా రెండేళ్లు సమయంలో ఉండడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. వీడియోలు, ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. మేజర్ అయ్యాక.. బాలిక ఇష్టాన్ని బట్టి వివాహం చేసుకోవచ్చని సూచించారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..