నా బాయ్‌ఫ్రెండ్‌ని వెతికి పెట్టాల్సిందే.. అంటూ పోలీసులకు ఫోన్ చేసిన యువతి.. ఆమె సమస్య విని చివరకు వారు చేసిన పని..
ABN , First Publish Date - 2023-02-05T21:04:56+05:30 IST
పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తుంటాయి. బాంబు బెదిరింపు ఫోన్లతో పాటూ కొన్నిసార్లు సిల్లీ సిల్లీ సమస్యలపై కొందరు పోలీసులకు ఫోన్లు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో చివరకు..
పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లకు అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తుంటాయి. బాంబు బెదిరింపు ఫోన్లతో పాటూ కొన్నిసార్లు సిల్లీ సిల్లీ సమస్యలపై కొందరు పోలీసులకు ఫోన్లు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో చివరకు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తుంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వధువు.. పోలీసులకు ఫోన్ చేసి, వింత కోరిక కోరింది. నా బాయ్‌ఫ్రెండ్‌ని వెతికి పెట్టాలని ఏకంగా పోలీసులను డిమాండ్ చేసింది. ఆమె సమస్య విని పోలీసులు చివరికి ఏం చేశారంటే..
తూర్పు చైనాలోని (East China) ప్రావిన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman).. ఓ యువకుడితో ఆరేళ్లుగా ప్రేమలో (love) ఉంది. అయితే ఇటీవల ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. యువకుడు తన ప్రియురాలిని (girlfriend) వదిలి వెళ్లిపోయాడు. అతడిని మర్చిపోలేని యువతి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అతడి జాడ తెలియలేదు. దీంతో చివరకు నేరుగా పోలీసులకు ఫోన్ (Police Helpline Number) చేసింది. ‘‘ నేను, బాయ్‌ఫ్రెండ్ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఎలాంటి కారణం లేకుండానే నన్ను వదిలి వెళ్లిపోయాడు.. వెంటనే వెతికి పెట్టండి’’.. అని చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
ఆమె సమస్యను మొత్తం విన్నాక పలు సలహాలు ఇచ్చారు. అర్థం చేసుకోలేని అలాంటి వ్యక్తికి దూరంగా ఉండమంటూ సూచించారు. మిమ్మల్ని బాధపెట్టిన వారితో జీవితాంతం ఎలా కలిసి ఉంటావంటూ ప్రశ్నించారు. మిమ్మిల్ని అర్థం చేసుకోలేని అతను దురదృష్టవంతుడు అనుకుని మర్చిపోవాలని చెప్పారు. అతడి నంబర్‌ను బ్లాక్ చేసి, అన్ని విధాలా అర్థం చేసుకునే మరో యువకుడిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. యువతి, పోలీసుల మధ్య జరిగిన సంభాషణ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి సంభాషణ విన్న నెటిజన్లు.. పోలీసులను అభింనందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పోలీసులకు పోన్ చేసి, ఇబ్బంది పెట్టొందంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.