Share News

Wtsup: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ స్టేటస్‌లు ఆ యాప్‌లో కూడా షేర్ చేయొచ్చు!

ABN , Publish Date - Dec 20 , 2023 | 01:04 PM

వాట్సప్ స్టేటస్(Wtsup Status) ఇప్పటివరకు ఫేస్ బుక్ లోనే షేర్ చేసే సదుపాయం ఉండేది. మెటా(Meta) తాజా అప్ డేట్ వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Wtsup: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ స్టేటస్‌లు ఆ యాప్‌లో కూడా షేర్ చేయొచ్చు!

న్యూయార్క్: వాట్సప్ స్టేటస్(Wtsup Status) ఇప్పటివరకు ఫేస్ బుక్ లోనే షేర్ చేసే సదుపాయం ఉండేది. మెటా(Meta) తాజా అప్ డేట్ వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై వాట్సప్ స్టేటస్ ని ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేయొచ్చు. వాట్సప్ లో స్టేటస్ పెట్టిన తరువాత.. ఇన్ స్టాలో షేర్ చేసేందుకు ఈజీ షార్ట్ కట్ ని మెటా త్వరలో అందుబాటులోకి తేనుంది.

ఈ ఫీచర్ ని యాప్ సెట్టింగ్‌లో ఆన్/ఆఫ్ చేయొచ్చు. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ వినియోగదారులకే ఉంటుంది. అదేకాకుండా ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ ని ఎవరెవరు చూడాలనుకుంటున్నారో కూడా సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు. తద్వారా ప్రైవసీ దెబ్బతినకుండా ఉంటుంది.


రెండు యాప్‌లు

స్టేటస్ ని ఇన్ స్టాలో షేర్ చేయడం అంటే ఒకే రాయితో రెండు పిట్టలను కొట్టడంలాంటిది. స్టేటస్ ని రెండు యాప్ లలో షేర్ చేయడం ద్వారా సోషల్ మీడియా ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. బీటా వెర్షన్ లో చేర్చనందునా ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మెటా వెల్లడించలేదు. అతి త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

Updated Date - Dec 20 , 2023 | 01:05 PM