మంగళ హారతులతో వధువుకు అత్తారింట్లోకి స్వాగతం.. సడన్‌గా లోపల గదిలో నుంచి అరుపులు, కేకలు.. కంగారుగా వెళ్లి చూడగా...
ABN , First Publish Date - 2023-02-01T21:23:29+05:30 IST
బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వధూవరులకు ఘనంగా వివాహం జరిగింది. అనంతరం అందరిలాగానే వధువు అత్తగారింటికి బయలుదేరింది. కొత్త కోడలు ఇంట్లోకి వస్తుండడంతో అత్తగారి బంధువులంతా..
బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వధూవరులకు ఘనంగా వివాహం జరిగింది. అనంతరం అందరిలాగానే వధువు అత్తగారింటికి బయలుదేరింది. కొత్త కోడలు ఇంట్లోకి వస్తుండడంతో అత్తగారి బంధువులంతా మంగళహారతులతో ఇంట్లోకి స్వాగతం పలికారు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు, కేకలు వినపడడంతో అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కంగారుగా లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నగేష్(20).. స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతూ ఉండేవాడు. కొన్నాళ్లుగా ఇతడు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఘార్‌పూర్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం ఘనంగా వివాహం (marriage) కూడా నిర్వహించారు. అనంతరం వధువు (bride) అత్తగారింటికి వచ్చింది. అత్తగారి బంధువులంతా కలిసి వధువుకు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం సందడి సందడిగా ఉంది. తీరా వధువు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు లోపల గదిలో నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నిశ్శబ్ధం ఆవరించింది. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అంతా కంగారుగా పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి చూడగా.. వరుడు (groom) ఉరికి వేలాడుతూ కనిపించాడు.
సుధీర్ బాబు సినిమా సీన్ రిపీట్ అయిందిగా.. 12 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి వెనుక కథేంటంటే..
అప్పటిదాకా బాగున్న నగేష్.. ఒక్కసారిగా ఉరికి వేలాడుతూ కనిపించడంతో బంధువులంతా బోరున విలపించారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే అతను మృతి (died) చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని వధువు.. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు వస్తే లేనిపోని సమస్యలు వస్తాయని భయపడ్డ వరుడి బంధువులు.. వెంటనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ కేసుపై పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వరుడు ఆత్మహత్య వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని మృతి.. అనుమానంగానే ఆ తల్లిదండ్రులు కూతురి బ్యాగ్‌ను పరిశీలిస్తే..