ఓ మహిళకు విపరీతంగా కడుపునొప్పి.. ఆపరేషన్ చేస్తూ పొట్టలో ఏముందో చూసి నోరెళ్లబెట్టిన డాక్టర్.. భర్తను పిలిచి మరీ..
ABN , First Publish Date - 2023-02-07T17:53:40+05:30 IST
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన వారికి.. అప్పుడప్పుడూ అదనపు సమస్యలు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల డబ్బులు వృథా అవడంతో పాటూ ఉన్న ఆరోగ్యం కూడా క్షీణిస్తుంటుంది. ఇందుకు ఉదాహరణగా.. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇటీవల ..
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన వారికి.. అప్పుడప్పుడూ అదనపు సమస్యలు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల డబ్బులు వృథా అవడంతో పాటూ ఉన్న ఆరోగ్యం కూడా క్షీణిస్తుంటుంది. ఇందుకు ఉదాహరణగా.. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇటీవల రాజస్థాన్‌లో ఈ తరహా కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు విపరీతంగా కడుపునొప్పి రావడంతో చికిత్స నిమిత్తం వైద్యుల వద్దకు వెళ్లారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో ఉన్న వస్తువును చూసి వైద్యులు ఖంగుతిన్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) జైపూర్ పరిధి ముహనా ప్రాంతానికి చెందిన సువాలాల్.. భార్య నాంకీ దేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి 2021లో ఊహించని సమస్య (unexpected problem) వచ్చి పడింది. జూలైలో నాంకీ ఉన్నట్టుండి కడుపు నొప్పి (Stomach ache) రావడంతో చికిత్స నిమిత్తం వాగు ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. గర్భాశయంలో సమస్య ఉందని, ఆపరేషన్ అవసరమని చెప్పారు. నవంబర్‌లో సర్జరీ జరిగింది. అయితే కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఏడు నెలల వ్యవధిలో సుమారు 20 సార్లు వైద్యులను సంప్రదించినా నొప్పి మాత్రం తగ్గలేదు.
దీంతో ఇటీవల బగ్రు ప్రాంతంలోని మరో ఆస్పత్రికి వెళ్లారు. నాంకీ దేవిని పరీక్షించిన వైద్యులు.. చివరు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మహిళకు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ మొదలెట్టారు. అయితే కడుపులో ఉన్న వస్తువును చూసి ఖంగుతిన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న మహిళ భర్తను లోపలికి పిలిపించి, భార్య కడుపులో ఉన్న బ్యాండేజీల కట్టను (bandages bundle) చూపించారు. గత ఏడాదిలో ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం (doctors negligence) కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. ఆదివారం పోలీసులను ఆశ్రయించిన భర్త.. జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.