NTR30: కథానాయిక ఎవరు? జాహ్నవి లేక మృణాల్

ABN , First Publish Date - 2023-02-13T15:38:03+05:30 IST

ఎన్టీఆర్ పక్కన కథానాయిక ఎవరు అనే విషయం. ఎందుకంటే సాంఘీక మాధ్యమాల్లో జాహ్నవి కపూర్ (#JhanviKapoor) అని అంటున్నారు. మొదటి నుండీ కూడా ఆమె పేరే వినపడుతోంది. ఆమె కూడా ఎన్టీఆర్ ని చాలా సందర్భాల్లో చాలా పొగిడింది కూడాను కదా. అందుకని ఆమెనే తీసుకోవచ్చు (#NTR30) అని కూడా అన్నారు.

NTR30: కథానాయిక ఎవరు? జాహ్నవి లేక మృణాల్

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఇప్పుడు వార్తల్లో వున్నాడు. ఆమధ్య తన అన్న కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సినిమా ఫంక్షన్ కి వచ్చి, కొరటాల శివతో (Koratala Siva) తాను చెయ్యబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం చూచాయగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే వార్త సాంఘీక మాధ్యమాల్లో మరోసారి వైరల్ అవుతోంది. సినిమా ఈనెల 23వ (#NTR30) తేదీని అధికారికంగా లాంచ్ అవుతుందని, మార్చి నెల నుండి షూటింగ్ మొదలు అవుతుందని వార్తలు వస్తున్నాయి.

ntr301.jpg

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా వుంది. ఎన్టీఆర్ పక్కన కథానాయిక ఎవరు అనే విషయం. ఎందుకంటే సాంఘీక మాధ్యమాల్లో జాహ్నవి కపూర్ (#JanhviKapoor) అని అంటున్నారు. మొదటి నుండీ కూడా ఆమె పేరే వినపడుతోంది. ఆమె కూడా ఎన్టీఆర్ ని చాలా సందర్భాల్లో చాలా పొగిడింది కూడాను కదా. అందుకని ఆమెనే తీసుకోవచ్చు (#NTR30) అని కూడా అన్నారు. అయితే ఇది పాన్ ఇండియా సినిమాగా చెయ్యాలన్న ఉద్దేశంతో కూడా ఆమెని తీసుకోవచ్చు అని కూడా అన్నారు. (#ManOfMassesNTR)

ntr302.jpg

ఇప్పుడు ఇంకో నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు కూడా వినపడుతోంది. ఈమె కూడా హిందీ సినిమాలు చాలా చేసి, మంచి పేరు సంపాదించుకుంది. దానికి తోడు ఆమధ్య విడుదల అయిన 'సీతా రామం' (Sitha Ramam) సినిమాలో మృణాల్ చాలా చక్కగా నటించి అందరి మెప్పు పొందింది. అందుకనే ఆమెని (#NTR30) కథానాయికగా తీసుకోవచ్చు అని ఇంకో వార్త కూడా వస్తోంది. లేక ఇద్దరు కథానాయికలు కూడా ఇందులో వుండే అవకాశం వుంది అని కూడా అంటున్నారు. ఇంతకీ ఎవరు ఎన్టీఆర్ (#NTR30)పక్కన నటిస్తారు అనే విషయం ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయినపుడు ప్రకటించే అవకాశం వుంది. (#JanhviKapoor)

ntr303.jpg

Updated Date - 2023-02-13T15:38:04+05:30 IST

News Hub