ప్రేమ పెళ్లి చేసుకున్న 7 నెలలకే ఊహించని షాక్.. అర్ధరాత్రి కట్టుకున్న భార్యే ఆ భర్త గొంతు కోసింది..!
ABN , First Publish Date - 2023-02-02T19:43:43+05:30 IST
ప్రేమించుకున్న వారిలో చాలా మంది పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటుంటారు. వివాహానంతరం వారి సంతోషాన్ని చూసి.. చివరకు పెద్దలు కూడా కలిసిపోతుంటారు. కానీ కొన్ని ప్రేమ వివాహాల్లో మాత్రం..
ప్రేమించుకున్న వారిలో చాలా మంది పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటుంటారు. వివాహానంతరం వారి సంతోషాన్ని చూసి.. చివరకు పెద్దలు కూడా కలిసిపోతుంటారు. కానీ కొన్ని ప్రేమ వివాహాల్లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడికి 7నెలలకే ఊహించని అనుభవం ఎదురైంది. ప్రేమగా చూసుకున్న భార్యే.. చివరకు భర్త గొంతు కోసింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయ్‌బరేలీ జిల్లా బచ్‌రావాన్‌లోని షేక్‌పూర్ సమోదా ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి.. జోహ్వాషార్కి గ్రామానికి చెందిన వందనను 7నెలల క్రితం ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కొన్ని నెలలకు ఉద్యోగ (job) వేట నిమిత్తం బయటి ప్రాంతానికి వెళ్లాడు. దీంతో అతడి భార్య పుట్టింట్లో ఉండేది. ఇలావుండగా, సతీష్ కుమార్ కొద్ది రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. అనంతరం భార్యను (wife) తీసుకొచ్చేందుకు బుధవారం అత్తగారి ఊరికి వచ్చాడు. దంపతులిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. రాత్రి భర్తకు భోజనం కూడా తినిపించింది.
ఎంగేజ్మెంట్ రోజే ఓ యువకుడికి ఊహించని షాక్.. సడన్‌గా ఇంటి ముందు ప్రేయసి ఎంట్రీ.. చివరకు..!
అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ చోటు చేసుకుంది. దీంతో సతీష్ మామ ఈశ్వర్ అక్కడికి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. వందన కత్తి తీసుకుని భర్తపై దాడి (Attack with a knife) చేసింది. గొంతుపై తీవ్ర గాయం అవడంతో రక్తస్రావమై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని విచారించారు. పూర్తి విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.