Wife-Husband: భార్యపై నిఘా.. సీక్రెట్‌గా ఆమె ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశాడో భర్త.. చివరకు హైకోర్టు ఏం తేల్చిందంటే..!
ABN , First Publish Date - 2023-10-16T12:04:51+05:30 IST
అనుమానం పెనుభూతం అని అంటారు. భార్యాభర్తలలో ఎవరికైనా ఎవరిమీదైనా అనుమానం కలిగిందంటే అది క్రమంగా పెరుగుతుంది. ఓ భర్త తన భార్య మీద అనుమానంతో కాల్ రికార్డ్ చేసి కోర్టుకు ఇస్తే జరిగింది ఇదీ..
అనుమానం పెనుభూతం అని అంటారు. భార్యాభర్తలలో ఎవరికైనా ఎవరిమీదైనా అనుమానం కలిగిందంటే అది క్రమంగా పెరుగుతూ భాగస్వామి వ్యక్తిత్వాన్ని చాలా చెడ్డగా చూసేలా చేస్తుంది. దృఢమైన బంధాన్ని కూడా చిన్న అనుమానం బీటలు వారేలా చేస్తుంది. ఓ భర్త తన భార్య మీద అనుమానంతో ఆమె అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ ను రికార్డు చేశాడు. ఆమెతో విడాకులు తీసుకున్న అనంతరం 'నా భార్య వ్యభిచారం చేస్తోంది, ఆమెకు నేను భరణం ఇవ్వను, ఇదిగోండి ఆధారాలు' అంటూ ఫోన్ కాల్ రికార్డ్స్ కోర్టుకు అందించాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు వింటే షాకవుతారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్ర హైకోర్టు(High Court)లో ఓ భరణం(alimony) కేసులో ఊహించని తీర్పు వెలువడింది. 38ఏళ్ళ మహిళకు తన భర్త(44) నుండి విడాకులు లభించగా ఆమెకు ఆమె మాజీ భర్త నుండి లభించాల్సిన భరణం విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆమె భర్త 'నా భార్య వ్యభిచారం చేస్తోంది, ఆమెకు నేను భరణం ఇవ్వాల్సిన పనిలేదు, దానికి తగిన ఆధారాలు ఇవే' అంటూ రహస్యంగా రికార్డు చేసిన తన భార్య ఫోన్ కాల్ సంభాషణలు(secret Phone call records) ఫ్యామిలీ కోర్టుకు చూపించాడు. ఆ దరఖాస్తును కోర్టు స్వీకరించింది. అందులో ఉన్న విషయాల మేరకు ఉత్తర్వులు కూడా జారిచేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అతని భార్య ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన అనుమతి లేకుండా ఫోన్ కాల్ సంభాషణలు రికార్డ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఆర్టికల్ 21ప్రకారం జీవించే హక్కులో గోప్యత హక్కు కూడా ఒక భాగమని, ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం అంటే గోప్యత హక్కును ఉల్లంఘించడం కిందకు వస్తుందని న్యాయస్థానం చెప్పింది.
Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..
2021, అక్టోబర్ 21న ఫ్యామిలీ కోర్టు భర్తకు అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ హైకోర్టు దాన్ని రద్దు చేసింది. హైకోర్టు అభిప్రాయం ప్రకారం CrPC సెక్షన్ 311 ప్రకారం దరఖాస్తును అనుమతించి ఫ్యామిలీ కోర్టు తప్పిదానికి పాల్పడింది. ఫ్యామిలీ కోర్టు సెక్షన్ 65కింద జారీ చేసిన సర్టిఫికెట్ తో పాటు అన్నింటిని రద్దు చేసింది. ఫోన్ కాల్ సంభాషణల ద్వారా సదరు మహిళ భర్త ఆమెను వ్యభిచారిణిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడని మహిళ తరపున లాయర్ చట్టంలో ఉన్న సెక్షన్ల ఆధారంగా వాదించడంతో ఈ కేసులో మహిళకు అనుగుణంగా కోర్టు స్పందించింది.