Viral News: అవును.. నిజమే.. గాజు సీసాలో ఉన్న ‘గుండె’ ఈ యువతిదే.. చాలా ఏళ్ల తర్వాత చూసి మురిసిపోయింది..!

ABN , First Publish Date - 2023-05-23T17:18:16+05:30 IST

ఈ సృష్టిలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. చాలా మంది చావు అంచుల వరకూ వెళ్లి ప్రాణాలు నిలుపుకున్న సంఘటనలు ఎన్నో చూసుంటాం.

Viral News: అవును.. నిజమే.. గాజు సీసాలో ఉన్న ‘గుండె’ ఈ యువతిదే.. చాలా ఏళ్ల తర్వాత చూసి మురిసిపోయింది..!
Viral News

ఈ సృష్టిలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. చాలా మంది చావు అంచుల వరకూ వెళ్లి ప్రాణాలు నిలుపుకున్న సంఘటనలు ఎన్నో చూసుంటాం. వినుంటాం. కొన్ని మిరాకిల్స్ మన మధ్యే జరుగుతుంటాయి. కొన్ని విన్నప్పుడు.. మరి కొన్ని చూపినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం.

ఓ యువతికి గుండె తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 22 ఏళ్లలో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడామెకు 38 ఏళ్లు. ఒకప్పుడు తన దేహంలో లబ్ డబ్ మంటూ కొట్టుకున్న ఆ గుండె కళ్లముందు ప్రత్యక్షమైంది. ఓ మ్యూజియంలో భద్రపరిచిన తన సొంత గుండెను చూసి ఉద్విగ్నానికి గురైంది (woman emotional). బ్రిటర్ రాజధాని లండన్‌లోని హంటేరియన్ మ్యూజియంలో చోటుచేసుకుంది.

హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కు చెందిన జెనిఫర్‌ సటన్‌ అనే యువతి.. యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న సమయంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో హార్ట్ మార్పు చేయాలని.. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు. వయసు చూస్తే 22 ఏళ్లే. సరిపోయే గుండె (heart) కోసం అన్వేషిస్తుండగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఎట్టకేలకు 2007 జూన్‌లో ఓ దాత దొరికారు. అనుకున్నట్టుగానే డాక్టర్లు గుండెను విజయవంతంగా అమర్చగలిగారు. ఇదిలా ఉంటే ఈమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి సైతం ఇలాంటి శస్త్రచికిత్స అనంతరం మృతి చెందారు. దీంతో ఆమె తొలుత ఆందోళన చెందింది. కానీ చివరకు సక్సెస్ కావడంతో ఊపిరి పీల్చుకుంది.

720.gif

శస్త్రచికిత్స ద్వారా తొలగించిన హృదయాన్ని ఆమె ప్రదర్శనలో ఉంచేందుకుగానూ ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌’కు అనుమతి ఇచ్చింది. దీంతో అవయవాల నమూనాలను ప్రదర్శించే ‘హంటేరియన్ మ్యూజియం’లో (glass jar in museum) దాన్ని భద్రపరిచారు. ఇప్పుడు దాన్ని పౌరులందరి సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తన సొంత హృదయాన్ని చూసుకుని పొంగిపోయారు. ఇది తన స్నేహితురాలని.. 22 ఏళ్ల పాటు తనను బతికి ఉంచిందని.. పాత హృదయాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పారు. అవయవదానాన్ని ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతిగా అభివర్ణించిన ఆమె.. దీన్ని ప్రోత్సహించేందుకుగానూ తాను వీలైనంత మేర కృషి చేస్తానని చెప్పారు. ఒకవేళ అవయవ దాతే లేకపోతే తన జీవితంలో అద్భుతమైన 16 ఏళ్లు కోల్పేయేదాన్నని తెలిపారు. పెళ్లి తదితర గొప్ప క్షణాలు ఎప్పటికీ జరిగేవి కావని గుర్తుచేశారు. తన హృదయాన్ని వీలైనంత మేర ఆరోగ్యంగా ఉంచుకుంటామని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bride: వరుడి మెడలో దండ వేయకుండా.. సడన్‌గా గదిలోకి వెళ్లిపోయిన వధువు.. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన నిర్వాకంతో..!

ఇది కూడా చదవండి: Viral Video: గత జన్మలో పాత పగలేమైనా ఈ గాడిదకు గుర్తొచ్చాయేమో.. స్కూటీపై వెళ్తున్న వాడిని అడ్డగించి మరీ..!

Updated Date - 2023-05-23T17:19:13+05:30 IST