Shocking: ఈ చేపలను తిని 32 ఏళ్ల మహిళ మృతి.. మరో 12 మంది పరిస్థితి విషమం.. ఇంతకీ ఇవేం చేపలంటే..!
ABN , First Publish Date - 2023-09-14T17:53:54+05:30 IST
తినుబండారాల నాణ్యత విషయంలో చాలా హోటళ్లు, దుకాణదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారి కారణంగా ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన వారిని గతంలో ఎంతో మందిని చూశాం. ఇలాంటి..
తినుబండారాల నాణ్యత విషయంలో చాలా హోటళ్లు, దుకాణదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారి కారణంగా ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన వారిని గతంలో ఎంతో మందిని చూశాం. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. చేపలు తిన్న 32ఏళ్ల మహిళ అనూహ్యంగా అస్వస్థతకు గురై మృతి చెందింది. మరో 12మంది పరిస్థితి విషమంగా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
నైరుతి ఫ్రాన్స్‌లోని (Southwest France) బోర్డియక్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి ప్రతి ఏడాదీ పర్యాటకులు (Tourists) అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ ప్రాంతం వైన్, వివిధ రకాల ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందింది. గుర్తుతెలియని 32ఏళ్ల మహిళతో పాటూ మరికొంత మంది సెప్టెంబర్ 4న ఈ ప్రాంతంలోని ఓ హోటల్‌కి వెళ్లారు. వీరిలో ఎక్కువగా అమెరికన్, ఐరిష్, కెనడియన్లు ఉన్నారు. ఇదిలావుండగా, హోటల్లో వారు వివిధ రకాల ఆహార పదార్థాలను టేస్టే చేసే సమయంలో అరుదుగా దొరికే నిల్వ ఉంచిన (Sardine fish) సార్డిన్ చేపలను తిన్నారు.
ఆ చేపలను తిన్న కొద్దిసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు (Illness after eating fish) గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో 32ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. బొటులిజం సమస్యతో ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సరైన సంరక్షణ లేని ఆహారం తినడం ద్వారా ఈ నరాల వ్యాధి వస్తుందని చెప్పారు. పది శాతం కేసుల్లో బోటులిజం వ్యాధి ప్రాణాంతకం అవుతుందని తెలిపారు. మరోవైపు మరో 12మంది పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంబంధింత రెస్టారెంట్లో తనఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.