Viral Video: పులితో ఆట ఇలాగే ఉంటుంది.. మహిళకు చుక్కలు చూపించిన పులి.. షాకవుతున్న నెటిజన్లు!
ABN , First Publish Date - 2023-08-11T13:44:14+05:30 IST
పులులు భయంకరమైన క్రూర జంతువులు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కొన్ని దేశాలలో పులులను పెంచుకునే వారు కూడా ఉంటారు. థాయ్‌లాండ్, దుబాయ్ వంటి దేశాలలో పులులను సాధారణ జంతువులగానే పరిగణిస్తారు. అయితే వాటితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.
పులులు (Tigers) భయంకరమైన క్రూర జంతువులు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కొన్ని దేశాలలో పులులను పెంచుకునే వారు కూడా ఉంటారు. థాయ్‌లాండ్, దుబాయ్ వంటి దేశాలలో పులులను సాధారణ జంతువులగానే పరిగణిస్తారు. అయితే వాటితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. wildworldgraphy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Tiger Videos).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పులి ఒక దిమ్మ మీద పడుకుని ఉంది. ఆ పులి దగ్గరకు వెళ్లిన ఓ మహిళ ఆ పులిని పట్టుకుని ఆప్యాయంగా నిమిరేందుకు ప్రయత్నించింది. కొద్ది సేపటి తర్వాత ఆ పులి ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఆ మహిళ చేయి, కాలును నోటితో పట్టుకుంది. ఆ మహిళకు కొద్ది క్షణాల పాటు చెమటలు పట్టించింది. అయినా ఆ మహిళ బెదిరిపోకుండా సహాయం కోసం సైగలు చేసింది. కంగారు పడితే పులి ప్రమాదకారిగా మారుతుందని గ్రహించిన మహిళ సహనంతో వ్యవహరించింది (Woman play with tiger goes wrong).
Viral Video: ఈ వీడియో వైరల్ కావాల్సిందే.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటో పిల్లలకు ఆ టీచర్ ఎలా వివరిస్తోందో చూడండి..
ఈ వీడియో సోషల్ మీడియా జనాలను షాక్ గురి చేసింది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె మూర్ఖత్వానికి తగిన శాస్తి జరిగింది``, ``ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పులి దాడి చేస్తున్నా చాలా సహనంగా వ్యవహరించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.