CongressVsBJP: హనుమాన్ కటౌట్ ముందు ఉమెన్ బాడీబిల్డర్ల ప్రదర్శనలు.. బీజేపీపై కాంగ్రెస్ సీరియస్..

ABN , First Publish Date - 2023-03-07T17:29:56+05:30 IST

సున్నితమైన మతాలు, దేవుళ్ల అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వివాదాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని నిరూపించే మరో ఘటన ఇటివల వెలుగుచూసింది...

CongressVsBJP: హనుమాన్ కటౌట్ ముందు ఉమెన్ బాడీబిల్డర్ల ప్రదర్శనలు.. బీజేపీపై కాంగ్రెస్ సీరియస్..

భోపాల్: సున్నితమైన మతాలు, దేవుళ్ల అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వివాదాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని నిరూపించే మరో ఘటన ఇటివల మధ్యప్రదేశ్‌లో (Madyapradesh) వెలుగుచూసింది. హనుమాన్ (Lord Hanuman) నిలువెత్తు కటౌట్ ముందు మహిళా బాడీబిల్డర్లు (Women body builders) పోజులివ్వడం ఇందుకు కారణమైంది. మధ్యప్రదేశ్‌లోని రత్లంలో (Ratlam) ఇటివల జరిగిన ఉమెన్స్ బాడీబిల్డింగ్ పోటీ (bodybuilding Competition) కాస్త కాంగ్రెస్ (congress), బీజేపీల (BJP) మధ్య రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

మార్చి 4, 5 తేదీల్లో రత్లం పట్టణంలో 13వ మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ కాంపిటిషన్ జరిగింది. ఈ ఈవెంట్‌‌లో భాగంగా వేదికపై లార్డ్ హనుమాన్ కటౌట్ ముందు మహిళా బాడీబిల్డర్లు ప్రదర్శనలు చేశారు. బాడీని ప్రదర్శిస్తూ వేర్వేరు పోజులిచ్చారు. ఈ విధంగా హనుమాన్ కటౌట్ ముందు మహిళలు శరీర ప్రదర్శన ఇవ్వడాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈవెంట్ ముగిసిన తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని గంగాజలంతో వేదికను శుద్ధి చేశారు. వేదికపైనే హనుమాన్ చాలీసా పటించారు. బీజేపీ (BJP) మేయర్ ప్రహ్లాద్ పటేల్‌తో కూడిన కమిటీ ఈ ఈవెంట్‌ను నిర్వహించగా.. రత్లం బీజేపీ ఎమ్మెల్యే చైతన్య కాశ్యప్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

Untitled-6.jpg

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే, మేయర్ ఇద్దరూ అసభ్యకరంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్వాకానికి పాల్పడినవారిని హనుమాన్ శిక్షిస్తాడని శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ (Congress) చీఫ్ కమల్ నాథ్ (Kamalnath) స్పందిస్తూ.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivaraj singh chouhan) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివరాజ్ సింగ్ పుట్టిన సందర్భంగానే ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... మహిళలు స్పోర్ట్స్‌లో రాణిస్తే చూడడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదని ఎదురుదాడి చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్లు పోలీసులకు మెమొరాండం సమర్పించారని, కాంగ్రెస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

Updated Date - 2023-03-07T17:55:46+05:30 IST