Viral Video: వామ్మో.. ఒళ్లు గగొర్పొడిచే వీడియో.. సముద్రంలోకి కొట్టుకుపోయిన బాలిక ప్రాణాలతో ఎలా బయటపడిందో చూడండి..
ABN , First Publish Date - 2023-08-20T11:17:42+05:30 IST
అదృష్టం బాగుంటే సముద్రంలో పడినా ప్రాణాలతో ఒడ్డుకు వచ్చేస్తామనే సామెత. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో చూస్తే ఆ సామెత నిజమేనని ఒప్పుకోక తప్పదు. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఓ బాలిక ధైర్యంగా పోరాడడంతో తిరిగి ఒడ్డుకు చేరుకుంది.
అదృష్టం బాగుంటే సముద్రంలో పడినా ప్రాణాలతో ఒడ్డుకు వచ్చేస్తామనే సామెత. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో (Viral Video) చూస్తే ఆ సామెత నిజమేనని ఒప్పుకోక తప్పదు. అలల (High Tides) ధాటికి సముద్రం (Sea)లోకి కొట్టుకుపోయిన ఓ బాలిక (Girl) ధైర్యంగా పోరాడడంతో తిరిగి ఒడ్డుకు చేరుకుంది. ఆమెకు ఓ వ్యక్తి కూడా సహకరించడంతో ప్రాణాలతో బయటపడింది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@InsaneRealitys అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బాలిక సముద్రం ఒడ్డున నిర్మించిన పాత్ వేపై ప్రమాదకర పరిస్థితుల్లో నిల్చుని ప్రకృతిని ఆస్వాదిస్తోంది. అయితే భారీ అలలు వెంట వెంటనే వచ్చి ఆ బాలికను లోపలికి లాగేశాయి. అయినా ఆ బాలిక ధైర్యం కోల్పోకుండా ఈత కొడుకుతూ నీటిపై తేలియాడింది. అక్కడే ఉన్న కొందరు ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, అలల ధాటికి భయపడి వెనక్కి వెళ్లిపోయారు.
Viral: వైద్య రంగంలోనే అత్యంత అరుదైన కేసు.. 31 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ.. 92 ఏళ్లకు డెలివరీ!
సముద్రంలో ఉన్న ఆ బాలిక అలల ధాటికి వెనక్కీ, ముందుకు కదులుతూ ఆ ఫుట్పాత్ మరో అంచు వైపునకు వెళ్లింది. అక్కడకు ధైర్యంగా వచ్చిన ఓ వ్యక్తి ఆ బాలికను కాపాడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 11 లక్షల మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా లైక్ చేశారు. ``ఆ బాలిక ధైర్యం కోల్పోకుండా పోరాడింది``, ``అతడు నిజమైన హీరో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.