ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు.. ప్రియురాలికి జాబ్ రావడంతో బెంగళూరుకు ట్రైన్ ఎక్కించి.. తర్వాత చూస్తే..
ABN , First Publish Date - 2023-01-19T20:08:25+05:30 IST
ప్రేమ వ్యవహారాల్లో కొందరు యువతీయువకులు.. ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. మరికొందరు మాత్రం భవిష్యత్‌లో ఆర్థికంగా స్థిరపడ్డాక.. వివాహం చేసుకోవాలని..
ప్రేమ వ్యవహారాల్లో కొందరు యువతీయువకులు.. ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. మరికొందరు మాత్రం భవిష్యత్‌లో ఆర్థికంగా స్థిరపడ్డాక.. వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. జార్ఖండ్‌కు చెందిన ఓ యువకుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఉద్యోగం వచ్చాక వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇటీవల అనుకోకుండా ప్రియురాలికి జాబ్ రావడంతో బెంగళూరుకు ట్రైన్ ఎక్కించాడు. తర్వాత రోజు నుంచి ఏం జరిగిందంటే..
జార్ఖండ్ (Jharkhand) రాంచీ పరిధి సుఖ్‌దేవ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపక్ కుమార్ అనే యువకుడు స్థానికంగా ఉండే కళాశాలలో ఎంబీఏ (MBA) చదువుతున్నాడు. ఇతడికి స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఓ యువతితో (young woman) స్నేహం ఉండేది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో దీపక్ తల్లిదండ్రులు కూడా వీరి వివాహానికి (marriage) అభ్యంతరం చెప్పలేదు. కొన్ని నెలల క్రితం యువతితో కలిసి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఉద్యోగం వచ్చే వరకూ పెళ్లి చేసుకోకూడదని దీపక్ నిర్ణయించుకున్నాడు. ఇటీవల దీపక్ ప్రియురాలికి బెంగుళూరులో (Bangalore) ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమెను సంతోషంగా బెంగళూరుకు ట్రైన్ ఎక్కించాడు. అయితే తర్వాత రోజు నుంచి ఆమె.. దీపక్‌ను దూరం పెట్టింది.
ఆమెకు ఫోన్ చేసినా అటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యాడు. ఇటీవల ఇదే విషయాన్ని తన స్నేహితుడు నసీమ్‌కు తెలియజేశాడు. ‘‘నాకు తెలిసిన మంత్రగాళ్లు ఉన్నారు.. వారి వద్ద పూజలు చేయిస్తే.. నీ ప్రియురాలు మళ్లీ తిరిగి వస్తుంది’’.. అని దీపక్‌కు చెప్పారు. అయితే ఇందుకోసం మతం మారాలంటూ ఒత్తిడి చేశారు. ఇందుకు దీపక్ ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఓ వైపు ప్రియురాలి సమస్య.. మరోవైపు స్నేహితుల బెదిరింపులతో మరింత ఆందోళనకు లోనయ్యాడు. మంగళవారం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఉరి వేసుకుని, ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.