Viral Video: నీటిపై తేలియాడుతున్న వ్యక్తి.. అలాగని గజ ఈతగాడు కాదు.. దాని వెనకున్న సైన్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-07-19T17:01:09+05:30 IST

ఈత బాగా తెలిసిన వారు నీటిపై రకరకాల విన్యాసాలు చేస్తారు. లోతు ఎంత ఉన్నా పట్టించుకోకుండా ఉపరితలంపై తేలియాడడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన విద్య. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ పూల్‌లో నీటి ఉపరితలంపై చక్కగా మంచం మీద పడుక్కున్నట్టు పడుకున్నాడు.

Viral Video: నీటిపై తేలియాడుతున్న వ్యక్తి.. అలాగని గజ ఈతగాడు కాదు.. దాని వెనకున్న సైన్స్ ఏంటంటే..

ఈత (Swimmers) బాగా తెలిసిన వారు నీటిపై రకరకాల విన్యాసాలు చేస్తారు. లోతు ఎంత ఉన్నా పట్టించుకోకుండా ఉపరితలంపై తేలియాడడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన విద్య. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి ఓ పూల్‌లో నీటి ఉపరితలంపై చక్కగా మంచం మీద పడుక్కున్నట్టు పడుకున్నాడు. అలాగని అతను గజ ఈతగాడు కాదు. అయినా అతడు నీటి ఉపరితలంపై తేలియాడడం వెనుక ఓ కారణముంది.

@fasc1nate అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో చుట్టూ నల్లటి నేలల మధ్యలో ఓ నీటి కొలను (Pool) ఉంది. చాలా లోతుగా ఉన్న ఆ కొలను లోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండి లోపల అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి ఈ కొలనులోకి దిగి తన చేతులు, కాళ్ళను చాచి హాయిగా పడుకున్నాడు (Man lay down in a pool). అతను ఈత కొట్టడానికి అస్సలు ప్రయత్నించకపోయినప్పటికీ మునిగిపోడు. ఇది ఈజిప్ట్‌ (Egypt)లోని సివా ఒయాసిస్ (Siwa Oasis) ప్రాంతం. ఇది 95 శాతం ఉప్పు గాఢత (Salt concentration)ను కలిగి ఉన్న ప్రాంతం. ఉప్పు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటి సాంద్రత (Water Density) చాలా ఎక్కువ.

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. ఓ వ్యక్తి చెవిలో సాలీడు ఎలా తిరుగుతోందో చూడండి.. వీడియో వైరల్!

నీటి సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటిలో ఎవరూ మునిగిపోరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ``ఆ కొలను చాలా అందంగా ఉంది``, ``ఇది చాలా రిఫ్రెష్‌గా ఉంది``, ``అధిక బరువు ఉన్నవారు కూడా ఇలా చేయవచ్చా?`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-19T17:01:09+05:30 IST