బ్యాగులో లక్ష రూపాయల నోట్ల కట్టలు.. కానీ నడిరోడ్డుపై బ్లేడుతో కోసుకుని ఓ యువకుడు దారుణం.. చివరకు..
ABN , First Publish Date - 2023-01-07T17:28:47+05:30 IST
చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా, పంజాబ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు లక్ష రూపాయల నోట్ల కట్టలు ఉన్న బ్యాగుతో..
చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా, పంజాబ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు లక్ష రూపాయల నోట్ల కట్టలు ఉన్న బ్యాగుతో ఓ స్టేడియానికి చేరుకున్నాడు. కారణాలు ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నడిరోడ్డుపై కూర్చుని బ్లేడుతో చేతి నరం కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు పోలీసుల విచారణలో అతడు ఏం చెప్పాడంటే..
పంజాబ్ (Punjab) చండీగఢ్‌కు చెందిన ప్రదీప్ అనే యువకుడు శుక్రవారం కోర్బా అనే ప్రాంతానికి చేరుకున్నాడు. స్థానిక స్టేడియంలో నడి రోడ్డుపై ఒక్కడే కూర్చుని కంగారుగా కనిపించాడు. తర్వాత ఉన్నట్టుండి బ్లేడు తీసుకుని చేతి నరాన్ని కోసుకుని ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేశాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని విచారించారు.
తాను కోర్బాను సందర్శించేందుకు వచ్చానని యువకుడు బదులిచ్చాడు. తన బ్యాగులో లక్ష రూపాయల నగదు, ఓ ఫోన్ బయటపడ్డాయి. అయితే యువకుడికి ఆత్మహత్యాయత్నానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఓ యువతిని కలుసుకోవడానికి ఇ్కకడికి వచ్చాడని, అయితే సదరు యువతి (young woman) అతన్ని కలిసేందకు నిరాకరించడంతో ఆత్మహత్యాయ్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం వెనుక ప్రేమ తదితర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..