నాకు ఈ పెళ్లి వద్దంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న యువకుడు.. అసలు నిజాలేంటో బయటపెట్టిన యువతి..!

ABN , First Publish Date - 2023-01-03T16:21:21+05:30 IST

పెళ్ళి గురించి ఆ అమ్మాయి ఎన్నో కలలు కనింది. కుటుంబ సభ్యులు కుదిర్చిన అబ్బాయితోనే బుద్ధిగా పెళ్ళికి ఒప్పుకొంది. రెండు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కానీ అబ్బాయి మాత్రం..

నాకు ఈ పెళ్లి వద్దంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న యువకుడు.. అసలు నిజాలేంటో బయటపెట్టిన యువతి..!

పెళ్ళి గురించి ఆ అమ్మాయి ఎన్నో కలలు కనింది. కుటుంబ సభ్యులు కుదిర్చిన అబ్బాయితోనే బుద్ధిగా పెళ్ళికి ఒప్పుకొంది. రెండు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కానీ అబ్బాయి మాత్రం నేను ఈ పెళ్ళి చేసుకోనని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎందుకు, ఏంటి అని రెండు కుటుంబాల వారూ అడిగినా కారణం చెప్పకుండా సమాధానం దాటవేశాడు. అయితే అతను చేసిన నిర్వాకాన్ని అమ్మాయి బయటపెట్టింది. ఇంతకూ అతను ఏం చేశాడంటే..

Viral Video: పెళ్లి ఊరేగింపులో వధువుతో కలిసి రొమాంటిక్‌ స్టంట్ చేయాలని చూసిన వరుడు.. పాపం చివరికి..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం షియోపూర్‌కు చెందిన హితేంద్ర మీనాకు, గ్వాలియర్‌లోనే నాకా చంద్రవాణి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ళ యువతితో 2022 మేలో నిశ్చితార్థం (Engagement) జరిగింది. హితేంద్ర సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్‌లో ఏఎస్ఐ అభ్యర్థిగా నియమించబడ్డాడు. అయితే అతను జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని పెళ్ళికి నిరాకరించాడు. దీంతో జరిగిన విషయం మొత్తం అమ్మాయి తన కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులను ఆశ్రయించింది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన తరువాత ఫోన్‌లో తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే 'నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి' అంటూ హితేంద్ర అమ్మాయితో చెప్పాడు. తనకు కాబోయే భర్తే కదా అనే కారణంతో ఆ అమ్మాయి కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో హితేంద్ర గ్వాలియర్ చేరుకుని.. ‘‘నేను ఫలానా హోటల్ రూమ్‌లో ఉన్నాను అక్కడికి రా అని కబురు పెట్టాడు.

స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకుల్లో పాల్గొన్న యువతి.. రాత్రి అంతా నిద్రపోయాక సడన్‌గా ఆమె చేసిన పని..

అతను చెప్పినట్టే ఆమె హోటల్‌కు చేరుకుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ హోటల్ గదిలోకి వెళ్ళారు. అక్కడ హితేంద్ర ఆమె మీద అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఆమె నిరాకరించినా 'మనం కాబోయే భార్యాభర్తలమేగా ఎందుకు అడ్డు చెబుతావు' అంటూ నచ్చజెప్పబోయాడు. అయితే ఆమె అతని మాటలు వినలేదు. దీంతో అతను ఆమెను బలాత్కారం చేశాడు. అంతటితో ఆగకుండా అప్పుడప్పుడూ ఆమెను కలిసి తన కోరిక తీర్చుకోవడమే కాకుండా ఆమెను శారీరకంగా (Indecent behavior) హింసించేవాడు. ఆమెతో తనకు ఇక అవసరం లేదని అనిపించాక.. నాకు పెళ్ళి వద్దంటూ జరిగిపోయిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాడు.

Viral Video: మహిళను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు.. కాసేపటికి కారు దిగి పరుగులు పెట్టారు..

అతను పెళ్ళికి నిరాకరించాడనే విషయం తెలుసుకున్న యువతి.. తన కుటుంబ సభ్యులతో అతను తనను మోసం చేసిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి హితేంద్ర మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారిద్దరి ఇష్టప్రకారమే నిశ్చితార్థం జరిగింది. అమ్మాయి కూడా తన కాబోయే భర్త అనే కారణంతోనే అతడిని కలిసింది. కానీ అతడు తన అవసరం తీరిపోయాక ఇలా పెళ్ళికి నిరాకరించడం నేరమే.. అతని మీద కేసు నమోదు చేసుకున్నాం, పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు.

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

Updated Date - 2023-01-03T16:21:28+05:30 IST