Nithin Kamath: నా స్నేహితుడికే ఇది జరిగిందంటూ జెరోదా సీఈవో నితిన్ కామత్ బయటపెట్టిన నిజాలివీ.. విస్తుపోయిన నెటిజన్లు.
ABN , First Publish Date - 2023-05-05T17:46:09+05:30 IST
మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. పెద్దోళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఈ మాట. రోజూ ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే
మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. పెద్దోళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఈ మాట. రోజూ ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. చూస్తూనే ఉంటున్నాం. వింటున్నాం. అయినా మోసపోతేనే ఉంటుంటారు. ఏదో అమాయకులు మోసపోయారంటే అనుకోవచ్చు. కానీ విద్యావంతులు కూడా ఈ లిస్ట్‌లో చేరడం విశేషం.
తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ బ్రోకింగ్ సంస్థ జెరోదా (Zerodha) CEO నితిన్ కామత్ (Nithin Kamath) స్నేహితుడు సైబర్ మోసానికి గురైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని నితిన్ కామత్ స్వయంగా వెల్లడించారు. పార్ట్ టై జాబ్ పేరుతో వాట్సాప్ ద్వారా (WhatsApp message) వచ్చిన ఓ మెసేజ్ కారణంగా తన స్నేహితుడు పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.
తన స్నేహితుడికి వాట్సాప్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది అని తెలిపారు. దక్షిణ అమెరికాలోని పెరూ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఉన్న రిసార్ట్‌లు, రెస్టారెంట్‌లపై సమీక్షలు ఇవ్వాలని అందులో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పూర్తి చేసినందుకు తన స్నేహితుడి అకౌంట్‌లో రూ.30,000 క్రెడిట్ అయ్యాయని వివరించారు. ఆ తర్వాత వారు ఒక టెలిగ్రామ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి క్రిప్టోలో ట్రేడింగ్ చేయమన్నారు. దానికి కొన్ని నియమాలు విధించారు. మీరు ట్రేడింగ్ ఖాతాకు నిజమైన డబ్బును బదిలీ చేయకుండానే లాభాలు పొందవచ్చని నమ్మించారు. బిట్‌కాయిన్, ఎథేరియం లాంటిది కాదని క్రిప్టో టోకెన్ల ధరలను మనమే సులభంగా మార్చుకోవచ్చని చెప్పారని పేర్కొన్నారు. ఆ తర్వాత అధిక లాభాలు రావడానికి నిజమైన డబ్బును బదిలీ చేయమన్నారు. ఆ మాటలు నమ్మి వారు చెప్పినట్టుగా తన స్నేహితుడు అలానే చేశాడని నితిన్ తెలిపారు.
అంతేకాకుండా తాము కూడా పెద్ద మొత్తంలో బదిలీలు చేయడం వల్ల లాభాలు పొందినట్లు వారు చెప్పుకొచ్చారని తెలిపారు. వారి ప్రలోభాలకు లొంగిపోయిన తన స్నేహితుడికి (friend) అత్యాశ పెరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో పెద్ద మొత్తంలో నగదును ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేశాడని వివరించారు. ఆ తర్వాత లాభాలను విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా డబ్బు బదిలీ కాలేదని తెలిపారు. ఇక తన వద్ద డబ్బు లేదని నిర్వాహకులకు తెలిపాడు. దీంతో వారు రుణం కూడా ఇచ్చారని... అలా రూ. 5 లక్షల (rs 5 lakh due) వరకు పెట్టుబడి పెట్టించారన్నారు. అయినా డబ్బు విత్‌డ్రా చేసుకోలేకపోయాడని నితిన్ చెప్పుకొచ్చారు. దీంతో మోసపోయినట్టుగా స్నేహితుడు గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించినట్లు నితిన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు నితిన్ ఒక సందేశం ఇచ్చారు. త్వరగా డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గమంటూ ఏదీ లేదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అంటూ నితిన్ కామత్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Viral News: ఏం పనులమ్మా ఇవి..? బైకును వదిలేసి వెనక్కు తిరిగి ముద్దులు.. ఈ ఇద్దరమ్మాయిల యవ్వారం మామూలుగా లేదుగా..!