Ashes 4th Test: నాలుగో సారి టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఒక ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండానే..

ABN , First Publish Date - 2023-07-19T15:38:57+05:30 IST

యాషెస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికివరకు అన్ని మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టే టాస్ గెలవడం గమనార్హం. అనగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టే టాస్ గెలిచింది.

Ashes 4th Test: నాలుగో సారి టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఒక ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండానే..

మాంచెస్టర్: యాషెస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికివరకు అన్ని మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టే టాస్ గెలవడం గమనార్హం. అనగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టే టాస్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో అతిథ్య జట్టు ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఆస్ట్రేలియా జట్టు పేసర్ స్కాట్ బోలాండ్, స్పిన్నర్ టాడ్ మర్ఫీని తప్పించి వారి స్థానాల్లో జోష్ హేజిల్‌వుడ్, కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఇంగ్లండ్ టీం పేసర్ ఓలి రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఒక ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండానే బరిలోకి దిగుతుండడం గమనార్హం. 5 టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే ముగిసిన 3 టెస్టుల్లో ఆస్ట్రేలియా 2-1తో అధిక్యంలో ఉంది. ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఆసీస్ సొంతం అవుతుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇంగ్లండ్ జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ ఓడిపోకూడదు. మ్యాచ్‌ను కనీసం డ్రా అయినా చేసుకోవాలి.


ఆస్ట్రేలియా తుది జట్టు:

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్

ఇంగ్లండ్ తుది జట్టు:

బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Updated Date - 2023-07-19T15:38:57+05:30 IST