IPL 2024: హర్ధిక్, గ్రీన్ ట్రేడ్ డీల్స్ తర్వాత.. 10 జట్ల వద్ద మిగిలిన సొమ్ము ఇలా..
ABN , First Publish Date - 2023-11-28T11:43:58+05:30 IST
IPL 2024 Auction: అతిపెద్ద ఐసీసీ టోర్నీ వన్డే వరల్డ్ కప్ ముగిసింది. ఈ టోర్నీ ఫైనల్‌లో టీమిండియాకు ఎదురైన పరాభవాన్ని అభిమానులు అంత త్వరగా మరిచిపోవడం కొంచెం కష్టమే. కానీ, క్రికెట్ అభిమానులకు మజాను అందించే మరో క్రికెట్ సమరం రెడీ అవుతోంది. అదే ఐపీఎల్ 2024.
IPL 2024 Auction: అతిపెద్ద ఐసీసీ టోర్నీ వన్డే వరల్డ్ కప్ ముగిసింది. ఈ టోర్నీ ఫైనల్‌లో టీమిండియాకు ఎదురైన పరాభవాన్ని అభిమానులు అంత త్వరగా మరిచిపోవడం కొంచెం కష్టమే. కానీ, క్రికెట్ అభిమానులకు మజాను అందించే మరో క్రికెట్ సమరం రెడీ అవుతోంది. అదే ఐపీఎల్ 2024 (IPL 2024). ఐపీఎల్ 17వ సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఆదివారంతో ట్రేడింగ్ విండో, ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పించే గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించాయి కూడా. పది జట్లు తమతో పాటు అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. అలాగే రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.
ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన విషయం హార్ధిక్ పాండ్యా, కామెరూన్ గ్రీన్‌కు సంబంధించిన ట్రేడ్ డీల్స్. ఈ డీల్ కింద హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్‌కు ఏకంగా రూ.15 కోట్లు ఇచ్చి మరి ముంబై ఇండియన్స్ రిటర్న్ తీసుకుంది. అలాగే ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌తో రూ.17కోట్ల డీల్ కుదుర్చుకుంది. ఇక త్వరలోనే దుబాయిలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిలీజ్, రిటైన్ తర్వాత 10 జట్ల వద్ద మిగిలిన బడ్జెట్ ఎంత? ఆయా జట్లకు ఎంత మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్: సీఎస్‌కే వద్ద ప్రస్తుతం మిగిలిన సొమ్ము రూ. 31.4కోట్లు. ఆరుగురు ఆటగాళ్లను తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకొవచ్చు.
ముంబై ఇండియన్స్: ముంబై వద్ద రూ. 17.75 కోట్లు ఉన్నాయి. 8 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే నలుగురు ఓవర్సీస్ ఆటగాళ్లకు అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్: ఆర్‌ఆర్ వద్ద మిగిలిన బడ్జెట్ రూ. 14.5కోట్లు. 8 స్లాట్లు ఖాళీగా ఉండగా, ముగ్గురు ఓవర్సీస్ ఆటగాళ్లను తీసుకొవచ్చు.
గుజరాత్ టైటాన్స్: గుజరాత్ వద్ద మిగతా జట్ల కంటే భారీ మొత్తం మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ జట్టు పర్సులో ఏకంగా రూ.38.15కోట్లు ఉన్నాయి. 8 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ స్లాట్లు రెండు ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్‌సీబీ వద్ద మిగిలిన సొమ్ము 23.25 కోట్లు. ఆరు స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ముగ్గురు విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ పర్సులో ప్రస్తుతం రూ. 28.95కోట్లు ఉన్నాయి. తొమ్మిది స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మరో మూడు ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్: లక్నో వద్ద మిగిలిన బడ్జెట్ వచ్చేసి రూ. 13.15కోట్లు. ఆరుగురు ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు ఉంది. అలాగే రెండు ఓవర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్: కోల్‌కతా వద్ద కూడా భారీగానే మిగిలి ఉంది. కోల్‌కతా పర్సులో ప్రస్తుతం రూ. 32.7కోట్లు ఉన్నాయి. మిగతా 9 టీమ్స్‌తో పోలిస్తే కోల్‌కతా వద్ద స్లాట్స్ భారీగా ఉన్నాయి. ఏకంగా 12 స్లాట్స్ ఉన్నాయి. నాలుగు ఓవర్సీస్ స్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్: పంజాబ్ వద్ద మిగిలిన సొమ్ము రూ. 29.1కోట్లు. ఇంకా 8 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. రెండు ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎస్‌ఆర్‌హెచ్ వద్ద మిగిలిన బడ్జెట్ వచ్చేసి రూ.34కోట్లు. మరో ఆగురుగు ప్లేయర్లకు అవకాశం ఉంది. అలాగే మూడు ఓర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.