Share News

IPL Auction: ఐపీఎల్ వేలం బరిలో 13 మంది తెలుగు కుర్రాళ్లు

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:59 PM

IPL Auction: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా మినీ వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో భారత్ సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు.

IPL Auction: ఐపీఎల్ వేలం బరిలో 13 మంది తెలుగు కుర్రాళ్లు

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా మినీ వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో భారత్ సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 9 మంది, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి నలుగురు వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మురుగన్ అభిషేక్, రాహుల్ బుద్ది, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, ఆరవెల్లి అవినాష్ రావు, రక్షన్ రెడ్డి, మనీష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి హనుమా విహారి, కేఎస్ భరత్, రికీ భుయ్, పృథ్వీరాజ్ ఎర్రా బరిలో ఉన్నారు.

కాగా 13 మంది తెలుగు క్రికెటర్లలో ఇప్పటికే పలువురు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. హనుమా విహారి, కేఎస్ భరత్ లాంటి ఆటగాళ్లు టీమిండియా టెస్టు జట్టులో ఆడారు. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. బరిలో ఉన్న కొందరు క్రికెటర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా గతంలో ఆడారు. ఇప్పుడు వేలంలో తమకు మంచి ధర పలకాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిని హైదరాబాద్ జట్టు తీసుకుంటుందా.. లేదా ఇతర జట్లు తీసుకుంటాయా అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, షేక్ రషీద్, భగత్ వర్మ, మహ్మద్ సిరాజ్ లాంటి తెలుగు ఆటగాళ్లు ఐపీఎల్ లాంటి మెగా లీగ్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 05:41 PM