Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. గంటలోనే టిక్కెట్లన్నీ ఫుల్..!!
ABN , First Publish Date - 2023-08-19T16:41:39+05:30 IST
ఆసియా కప్ లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం తొలి దశ టిక్కెట్ల విక్రయాలను శుక్రవారం నాడు పీసీబీ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభించిన గంట లోపే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 35వేల టిక్కెట్లను విక్రయానికి అందుబాటులో ఉంచగా అభిమానులు వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.
మరికొద్దిరోజుల్లో ఆసియా కప్ జరగబోతోంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆసియా కప్‌ను ఆతిథ్యం ఇస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉన్నా సెక్యూరిటీ వల్ల టీమిండియా కోసం ఆసియా కౌన్సిల్ శ్రీలంకలో కూడా మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఆగస్టు 30న పాకిస్థాన్-నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు భారీ క్రేజ్ నెలకొంది.
ఇది కూడా చదవండి: ODI World Cup: వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే.. చరిత్రలో ఇదే తొలిసారి..!!
ఆసియా కప్ లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయాలను శుక్రవారం నాడు పీసీబీ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభించిన గంట లోపే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 35వేల టిక్కెట్లను విక్రయానికి అందుబాటులో ఉంచగా అభిమానులు వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ మ్యాచ్ ఒక్కో టిక్కెట్ ధర రూ.2,500గా ఉన్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ కారణాల వల్ల భారత్, పాకిస్థాన్ టీమ్స్ ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనడం లేదు. దీంతో ఆసియా కప్, ICC ఈవెంట్‌ల సమయంలో మాత్రమే ఈ జట్లు తలపడుతున్నాయి. అందువల్ల టిక్కెట్ల కోసం డిమాండ్ భారీగా ఉంటోంది. చిరకాల ప్రత్యర్థులు ఆడే మ్యాచ్‌ల టిక్కెట్ ధరలు సాధారణ మ్యాచ్‌ల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి. కాగా ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాలను ఇటీవల పీసీబీ ప్రారంభించింది. ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.