Share News

ODI World Cup 2023: ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2023-11-16T21:43:47+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.

ODI World Cup 2023: ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. 116 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. దీంతో వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు.

213 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 6 ఓవర్లలో 60 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది. అయితే స్వల్ప వ్యవధిలో ఆస్ట్రేలియా చకచకా వికెట్లు కోల్పోవడంతో ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని అభిమానులు భావించారు. ట్రావిస్ హెడ్ (62), వార్నర్ (29) రాణించగా.. మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ (30), లబుషేన్ (18), జాష్ ఇంగ్లీస్ (28) కాసేపు పోరాడారు. అనంతరం సాధించాల్సిన రన్‌రేట్ చాలా తక్కువ ఉండటంతో మిగిలిన ఆసీస్ బ్యాటర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ తమ జట్టును లక్ష్యం వైపు తీసుకువెళ్లారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-16T23:15:10+05:30 IST