Share News

BAN Vs NZ: బంగ్లా ఆటగాడు సెల్ఫ్ అవుట్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

ABN , First Publish Date - 2023-12-06T18:35:52+05:30 IST

BAN Vs NZ: మీర్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు. బౌలర్ జేమీసన్ వేసిన బంతిని చేత్తో అడ్డుకోవడంతో థర్డ్ అంపైర్ హ్యాడ్లింగ్ ది బాల్‌గా అవుట్ ఇచ్చాడు.

 BAN Vs NZ: బంగ్లా ఆటగాడు సెల్ఫ్ అవుట్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

మీర్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు. బౌలర్ జేమీసన్ వేసిన బంతిని చేత్తో అడ్డుకోవడంతో థర్డ్ అంపైర్ హ్యాడ్లింగ్ ది బాల్‌గా అవుట్ ఇచ్చాడు. వాస్తవానికి బంతి వికెట్లకు దూరంగానే వెళ్లినా నిబంధనల ప్రకారం బాల్‌ను చేత్తో అడ్డుకోకూడదు. కానీ ముష్ఫీకర్ రహీమ్ బాల్‌ను చేత్తో అడ్డుకోవడంతో న్యూజిలాండ్ క్రికెటర్లు అప్పీల్ చేయగా అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించారు. 2017లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం థర్డ్ అంపైర్ ముష్ఫీకర్‌ను అవుట్‌గా ప్రకటించడంతో బంగ్లాదేశ్ బిత్తరపోయింది. టెస్టుల్లో తొలిసారిగా బంగ్లాదేశ్ ఆటగాడు హ్యాడ్లింగ్ ది బాల్‌ రూల్‌తో అవుటయ్యాడు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌ చేసిన బంగ్లాదేశ్‌కు ఖర్మ ఫలితం ఎదురైందని.. అందుకే హ్యాడ్లింగ్ ది బాల్‌గా ముష్ఫీకర్ అవుట్ అయ్యాడని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు.

కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ అదరగొడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను ఓడించిన బంగ్లాదేశ్ ఇప్పుడు రెండో టెస్టులోనూ గెలిచేలా ప్రదర్శన చేస్తోంది. మీర్పూర్ వేదిగా బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బంగ్లా బ్యాటర్లు భారీ స్కోరు చేయలేకపోయారు. ముష్ఫీకర్ రహీమ్ (35), షాదాత్ హుస్సేన్ (31), మెహిదీ హసన్ మిరాజ్ (20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్‌కు తలో మూడు వికెట్లు పడ్డాయి. అజాజ్ పటేల్‌కు రెండు వికెట్లు, టిమ్ సౌథీకి ఒక వికెట్ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. విలియమ్సన్ (13), డెవాన్ కాన్వే (11) విఫలమయ్యారు. దీంతో ఒక్కరోజులోనే 15 వికెట్లు నేలకూలాయి. టెస్ట్ సిరీస్‌ను సమం చేయాలంటే న్యూజిలాండ్ సంచలన ప్రదర్శన చేయాల్సిందే.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T18:35:53+05:30 IST