Share News

IPL 2024: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 చిట్టచివరిదా?.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఆసక్తికర సమాధానం ఇదే..

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:14 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఏనాడో వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే వయసు మీద పడడంతో ఐపీఎల్‌ నుంచి ధోనీ నిష్ర్కమణ ఎప్పుడు? అని చాలా కాలంగా డిబేట్ నడుస్తోంది. ఇదే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

IPL 2024: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 చిట్టచివరిదా?.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ఆసక్తికర సమాధానం ఇదే..

చెన్నై: అంతర్జాతీయ క్రికెట్‌కు ఏనాడో వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే వయసు మీద పడడంతో ఐపీఎల్‌ నుంచి ధోనీ నిష్ర్కమణ ఎప్పుడు? అని చాలా కాలంగా డిబేట్ నడుస్తోంది. ఇదే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత కూడా ఎంఎస్ ధోనీ ఆడతాడా? అని ప్రశ్నించగా... ఈ ప్రశ్నకు ధోనీ మాత్రమే సమాధానం చెప్పగలడని, ఆ విషయం తనకు తెలియదని అన్నారు.

‘‘ కెప్టెన్ విషయానికొస్తే అతడు మీకే నేరుగా సమాధానమిస్తాడు చూస్కోండి. అతడు ఏం చేయబోతున్నాడో మాకు చెప్పడు. ధోనీ ఇప్పుడు ఫీట్‌గానే ఉన్నాడు. పునరావాసాన్ని మొదలుపెట్టాడు. జిమ్‌లో గడపడం ప్రారంభించాడు. బహుశా మరో 10 రోజుల్లో నెట్స్‌లో ప్రాక్టిస్ కూడా మొదలుపెడతాడు’’ అని విశ్వనాథన్ సమాధానం ఇచ్చారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ఎంఎస్ ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే ధోనీ ఫిట్‌గా ఉంటాడని అంచనాగా ఉంది.

కాగా ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆరంభమవడానికి ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం కూడా పూర్తయ్యింది. ఇక రాబోయే సీజన్‌పై అన్ని జట్లు కసరత్తులు ఆరంభించాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎంఎస్ ధోనీ ఈ ఏడాది కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఫిట్‌గా ఉంటే ఆ తర్వాత సీజన్‌కు కూడా అతడు జట్టుకు నాయకత్వం వహిస్తాడా? అని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. అయితే సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్ ఇచ్చిన సమాధానం ధోనీ అభిమానుల్లో ఉత్సుకతను మరింత పెంచిందని చెప్పాలి.

Updated Date - Dec 24 , 2023 | 12:14 PM