ODI World Cup: ప్రపంచకప్‌లో ఒక్క సెకన్ ప్రకటన ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
ABN , First Publish Date - 2023-10-05T18:44:02+05:30 IST
వన్డే ప్రపంచకప్‌కు ఆదరణ భారీగా ఉంటుందని యాడ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ప్రకటనల రేటు చాలా భారీగా పెరిగింది. ఈ టోర్నీకి సంబంధించి అన్ని బ్రాండ్లు కలిపి ప్రకటనల కోసం 240 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నాయి.
టీమిండియా వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఈసారి టీమిండియా హాట్ ఫేవరెట్‌గా దిగుతోంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీ నవంబర్ 19 వరకు కొనసాగనుంది. దీంతో కార్పొరేట్ కంపెనీలు తమ ప్రమోషన్‌ల కోసం మెగా టోర్నీపై కన్నేశాయి. ఈ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా దేశాల్లో అభిమానులు వీక్షిస్తారు. దీంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. దాదాపు 100 కోట్ల మంది ఈ మెగా టోర్నీని వీక్షించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ODI World Cup 2023: ఇది ప్రపంచకప్ మ్యాచేనా..? ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న మోదీ స్టేడియం
ఈ ప్రపంచకప్‌కు ఆదరణ భారీగా ఉంటుందని యాడ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ప్రకటనల రేటు చాలా భారీగా పెరిగింది. ఈ టోర్నీకి సంబంధించి అన్ని బ్రాండ్లు కలిపి ప్రకటనల కోసం 240 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నాయి. దీనిని మన కరెన్సీలోకి మారిస్తే దాదాపు రూ. 2,000 కోట్లు అవుతుంది. 140 కోట్ల జనాభా కలిగిన ఇండియాలో క్రికెట్‌కు అత్యంత ప్రజాదరణ ఉండటంతో ఈ రేంజ్‌లో కంపెనీలు ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో 10 సెకన్ల స్లాట్ కోసం కార్పొరేట్ కంపెనీలు రూ.30 లక్షల వరకు వెచ్చిస్తున్నాయి. అంటే ఒక్క సెకను ప్రకటన ఖరీదు దాదాపు రూ.3 లక్షలకు పైమాటే. గత ప్రపంచకప్ కంటే ఇది 40 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ప్రపంచకప్‌లో ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేస్తున్న కంపెనీల్లో కూల్‌డ్రింక్ కంపెనీ కోకా కోలా, ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ పే, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సౌదీ అరేబీయాకు చెందిన ఆయిల్ గ్రూప్ ఆరామ్‌కో, దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్, కార్ల కంపెనీ నిస్సాన్ మోటార్ ఉన్నాయి.