Share News

ODI World Cup 2023: భారత్ ఓటమి.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన కంపెనీ

ABN , First Publish Date - 2023-11-20T19:49:29+05:30 IST

Team India Lost in World Cup Final: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌కు చెందిన ఓ మార్కెటింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకుని తమ ఉద్యోగులు ఈ షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. ఈ మేరకు సోమవారం కంపెనీకి సెలవు ప్రకటిస్తున్నట్లు తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది.

ODI World Cup 2023: భారత్ ఓటమి.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన కంపెనీ

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు యువ ఆటగాళ్లు కూడా తాము ఇంకా తేరుకోలేదని.. కాస్త సమయం పడుతుందని సోషల్ మీడియాలో ట్వీట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు తమ గుండె బద్దలైందని.. నిన్నటి షాక్ నుంచి ఇంకా బయటపడలేదని చెప్పారు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లలో టీమిండియా ఎప్పుడూ ఆలౌట్ కాలేదు. కానీ ఫైనల్లో తొలిసారి ఆలౌటైంది. అంతేకాకుండా తక్కువ స్కోరు చేసింది. బలమైన ప్రత్యర్థి ముందు ఆ స్కోరు ఏ మాత్రం సరిపోతుందని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్లే మన బౌలర్లు ఆ స్కోరును డిఫెండ్ చేసుకోలేక చేతులెత్తేశారు. దీంతో పలువురు అభిమానులు భారత్ ఓడిపోయిన తీరు నుంచి ఇంకా కోలుకోలేదు.

ప్రపంచకప్‌లో భారత్ అనూహ్య ఓటమి నేపథ్యంలో గురుగ్రామ్‌కు చెందిన ఓ మార్కెటింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకుని తమ ఉద్యోగులు ఈ షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. ఈ మేరకు సోమవారం కంపెనీకి సెలవు ప్రకటిస్తున్నట్లు తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. నిన్నటి బాధ నుంచి కోలుకునేందుకు సెలవు తీసుకోండి అంటూ సోమవారం ఉదయం పంపిన మెయిల్స్‌లో తెలిపింది. సదరు కంపెనీకి చెందిన ఉద్యోగి ఈ మెయిల్‌ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఎవరైనా మ్యాచ్ చూసేందుకు సెలవు ఇస్తారని.. కానీ ఓటమి నుంచి కోలుకునేందుకు కూడా సెలవు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఓటమిని తట్టుకోలేక పలుచోట్ల అభిమానులు గుండెపోటుతో చనిపోగా.. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసోంలోని గౌహతిలో ఓ ఐటీఐ విద్యార్థి భారత్ ఓటమిని జీర్ణించుకోలేక బెడ్‌రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T19:49:30+05:30 IST