Share News

IND Vs BAN: టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం..!!

ABN , First Publish Date - 2023-10-19T15:06:36+05:30 IST

పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు.

IND Vs BAN: టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం..!!

వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా 9వ ఓవర్‌ను బౌలింగ్ చేసేందుకు వచ్చిన పాండ్య తొలి బంతిని డాట్ బాల్‌‌గా వేయగా.. తర్వాత రెండు బాల్స్‌కు బౌండరీలు సమర్పించుకున్నాడు. అయితే మూడో బాల్‌ను బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపే ప్రయత్నంలో హార్దిక్ గాయపడ్డాడు. కాలు బెనకడంతో టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. కొంతసేపు తర్వాత బౌలింగ్‌కు సిద్ధమైన పాండ్య ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఈ ఓవర్‌లో మిగతా మూడు బాల్స్‌ను విరాట్ కోహ్లీ వేశాడు.

ఇది కూడా చదవండి: World cup: మరో 67 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బ్రేక్ చేయనున్న గిల్.. సౌతాఫ్రికా దిగ్గజం రికార్డు గల్లంతు!

అయితే పాండ్యకు అయిన గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. అతడికి పెద్ద గాయం కాకూడదని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్ సాధించాలంటే టీమిండియాకు హార్దిక్ పాండ్య చాలా కీలకం. అతడు బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బౌలింగ్‌లో ప్రభావం చూపిన పాండ్యకు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం సరిగ్గా రాలేదు. దీంతో రానున్న మ్యాచ్‌లలో అతడి ఫామ్, నిలకడ చాలా కీలకమని టీమిండియా భావిస్తోంది. అటు పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి 10 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 63 పరుగులు చేసింది.

hardik pandya.jpg

Updated Date - 2023-10-19T15:10:24+05:30 IST