Hardik Pandya: అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు వెంటపడ్డారు.. అదే పాండ్య స్పెషల్
ABN , First Publish Date - 2023-11-27T21:20:28+05:30 IST
2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు మెగా వేలంలో రూ.15 కోట్లకు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసింది. అక్కడితో ఆగకుండా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో గుజరాత్ జట్టును గొప్పగా నడిపించిన పాండ్య ఏకంగా తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సీజన్‌లో ఆటగాడిగానూ అతడు రాణించాడు. వరుసగా రెండో సీజన్‌లో కూడా పాండ్య తన కెప్టెన్సీతో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
బరోడాకు చెందిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెలుగులోకి వచ్చింది ఐపీఎల్‌తోనే. కపిల్ దేవ్ తర్వాత అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పాండ్య పేరు తెచ్చుకున్నాడు. నిజానికి మెగా టీ20 లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కారణంగానే అతడికి జాతీయ జట్టులో చోటు లభించింది. అతడి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన జట్టు ముంబై ఇండియన్స్. 2015లో హార్దిక్ పాండ్య ఐపీఎల్ కెరీర్ మొదలైంది. తొలి సీజన్‌లోనే చక్కటి ప్రదర్శన చేసి.. రెండో సీజన్‌కల్లా జట్టులో కీలకంగా మారాడు. దీంతో ముంబై ఇండియన్స్‌తోనే హార్దిక్ పాండ్య ప్రయాణం సుదీర్ఘకాలం కొనసాగింది. కానీ 2022లో ముంబై ఇండియన్స్ అతడిని వేలంలోకి విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిఖార్సైన ఆల్‌రౌండర్‌ను వదులుకుని ముంబై తప్పుచేసిందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో 2022 సీజన్‌లో ముంబై రాణించలేక చతికిలపడింది.
అయితే 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు మెగా వేలంలో రూ.15 కోట్లకు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసింది. అక్కడితో ఆగకుండా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో గుజరాత్ జట్టును గొప్పగా నడిపించిన పాండ్య ఏకంగా తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సీజన్‌లో ఆటగాడిగానూ అతడు రాణించాడు. వరుసగా రెండో సీజన్‌లో కూడా పాండ్య తన కెప్టెన్సీతో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు ముంబై పరిస్థితి దారుణంగా తయారైంది. గ్రీన్ మినహా ఆల్‌రౌండర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో హార్దిక్ అవసరం తమ జట్టుకు ఉందని ముంబై ఇండియన్స్ గ్రహించింది. ఎలాగైనా తిరిగి తమ జట్టులోకి తేవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్‌తో సంప్రదింపులు జరిపింది. మొత్తంగా అప్పుడు వద్దనుకున్న జట్టే ఇప్పుడు తన వెంట పడటంతో పాండ్య కూడా తన మనసు మార్చుకుని ముంబై జట్టుకు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మరి భవిష్యత్ కెప్టెన్ ప్రణాళికలు పక్కన పెడితే 2024లో పాండ్య ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.